సాధారణంగా మహిళలు ఎక్కువగా తమ ముఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ముఖాన్ని మరింత అందంగా మార్చడానికి మార్కెట్లో దొరికే రకరకాల కాస్మోటిక్స్ ని ఉపయోగిస్తూ అప్పటికప్పుడు ముఖానికి మెరుగులు అద్దుతున్నారే కానీ శాశ్వతంగా వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గమనించలేకపోతున్నారు. ఇలా బాధపడే మహిళలు ఎక్కువగా హోం టిప్స్ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఇకపోతే జిడ్డు చర్మం  ఉండే మహిళల గురించి వారు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత మేకప్ వేసినా సరే క్షణాల్లో కరిగిపోతూ చర్మం మొత్తం జిడ్డుగా మారుతూ ఉంటుంది. అలాంటివారు కొన్ని హోమ్ టిప్స్ పాటించారంటే చాలు ఎటువంటి జిడ్డు చర్మానైనా దూరం చేసుకోవచ్చు. జుట్టు చర్మం ఉన్నవారికి వేసవికాలంలో మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు నీళ్లు బాగా మరగనిచ్చి అందులో పసుపు వేసి ఆవిరి పెట్టుకోవడం వల్ల క్రమక్రమంగా జిడ్డు చర్మం తొలగిపోతుంది.

అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సెనగ పిండిలో ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి.  ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాలు పాటించినట్లయితే జిడ్డు చర్మం ఇట్టే దూరమై చర్మం పై ఉన్న నల్లటి మచ్చలు కూడా దూరం అవుతాయి.

ఆయిల్ స్కిన్ ఉన్నవారు  రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరుని తీసుకోవాలి. ఫ్రూట్ మరియు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు వారానికి రెండుసార్లు మీ స్కిన్ ఎక్స్పోలియేట్  చేయండి.  ఎక్స్పోలియేట్ చేయడం వల్ల పింపుల్స్, వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ వంటివి రావు.ఆల్కహాల్ లేని టోనర్ ని ఉపయోగించండి.పంట పొలాల్లో  ఒక అడుగు లోపల బాగాన ఉండే మంచి మట్టిని తీసుకుని అందులో నీరును కలిపి  ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: