సాధారణంగా చిన్నపిల్లలు పక్కతడపడం మామూలే. వయసు పెరిగే కొద్దీ, రాత్రి సమయంలో పక్కతడపడం సహజంగానే మానుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు, వయసు పెరిగినా కూడా, రాత్రి సమయంలో పక్క తడుపుతుంటారు. అలాంటి పిల్లల్లో కొన్ని రకాల మానసిక కారణాలవల్ల, రాత్రి సమయంలో వారికి తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోతుంటుంది. పిల్లల్లో ఉండే మానసిక ఒత్తిడి లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొంతమంది పిల్లలు కొన్ని రకాల మానసిక ఒత్తిడిలు వారికి తెలియకుండానే అనుభవిస్తుంటారు.ముఖ్యంగా పిల్లలు ఎదురుగా వారి తల్లిదండ్రులు  అరుచుకోవడం, గొడవ పడటం, ఒకరినొకరు దూషించుకోవడం చేస్తుంటారు. దీని వల్ల వారు ఒత్తిడికి గురవతుంటారు. మరియు ఆ పిల్లలు వారి అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెళ్లతో కానీ ఎక్కువగా పోట్లాడుకోవడం కూడా ఒక కారణం. మరియు స్కూల్ లో ఒత్తిడి గా ఉన్న ఇలా పక్కతడుపుతూ ఉంటారు. కావున అలాంటి పిల్లలకు యొక్క తల్లిదండ్రులు పక్క తడుపుతూనే గాబరా పెట్టి,వారికి మానసిక ఒత్తిడికీ గురి చేయకుండా వారికి సర్ది చెప్పాలి. ఇలా పిల్లల్లో పక్క తడపడం మానుకోవడానికి కొన్ని రకాల  పనులు అలవాటు చేయడం ఉత్తమం.

పక్కతడిపే పిల్లలకు రాత్రి పడుకోబోయే ముందే మూత్రవిసర్జన చేయడం అలవాటు చేయాలి. అర్ధరాత్రి సమయంలో అలారం పెట్టుకుని మరీ,నిద్రలేపి మరొకసారి మూత్ర విసర్జన చేసేలాగా ప్రోత్సహించాలి. ఇలా అలవాటు చేయడం వల్ల మూత్రనాళాలు సరైన సమయంలో మూత్రవిసర్జన చేయడం అలవాటు చేసుకుంటాయి. ఇలాంటి పిల్లలను వేరే పిల్లలతో పోల్చి చెప్పకూడదు. ఇలా కూడా ఆ పిల్లలకు మానసికఒత్తిడి కలుగుతుంది.

ఆయుర్వేదచికిత్స..
దీనికి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ పుట్టమన్ను తీసుకొని అందులో, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొత్తి కడుపు భాగంలో రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మూత్రనాళ కండరాలు బిగుతుగా మారి, మూత్ర విసర్జన సక్రమంగా జరిగేలా చేస్తాయి. మరియు అధికమూత్రానికి కారణమయ్యే చాక్లెట్లు, జంక్ ఫుడ్ కీ దూరంగా ఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: