ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది సమయం లేక బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే కొంతమంది బరువు తగ్గుతామని భావిస్తూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే బరువు తగ్గకపోగా బరువు పెరుగుతారని పలు పరిశోధనల్లో తేలింది. అల్పాహారం తినకపోతే మెటబాలిజం నెమ్మదించి బరువు పెరుగుతాం. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే చేసే పనిపై కూడా శ్రద్ధ పెట్టలేము. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే బరువు అదుపులో ఉండటంతో పాటు క్యాలరీలు కరుగుతాయి. 
 
 
బ్రేక్ ఫాస్ట్ తిననివారిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పని చేయకపోవడంతో పాటు చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. కొలెస్ట్రాల్, రక్తపోటు లాంటి సమస్యలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోనివారిలో ఎక్కువగా వస్తాయి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోనివారిలో నెలసరి సమస్యలు కూడా ఎదురవుతాయని ఒక పరిశోధనలో తేలింది. 
 
బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో జుట్టు రాలే అవకాశం కూడా ఉంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచే కెరాటిన్ నిలిచి ఉండటానికి బ్రేక్ ఫాస్ట్ తోడ్పడుతుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఎసిడిటీ పెరగడంతో పాటు అల్సర్ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ అలవాటు లేనివారిలో గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోను బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేయకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: