మానవ జీవితంలో కొన్ని సరదాలు సంతోషాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సంతోష పడుతుంటారు. కొందరు బయటకు వెళ్లి మంచి ఫుడ్ తిని అలా షికారుకు వెళ్ళడం, మరి కొందరు సినిమాలకు వెళ్ళడం, ఇంకా కొంతమంది అయితే స్నేహితులతో కలిసి మద్యాన్ని సేవిస్తూ సంతోషంగా ఉంటారు. ఒక్క మద్యం సేవించడానికి మాత్రమే ఒక్క సందర్భం అవసరం లేదు. శుభకార్యాలు అయినా, బర్త్ డే పార్టీ అయినా, ఫ్రెండ్ బాధలో ఉన్నా, అదే ఫ్రెండ్ సంతోషంలో ఉన్నా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఎక్కువగా యువకులు బీర్ ను తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బీర్ తాగడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ప్రచారంలో ఉన్నప్పటికీ తెలుస్తున్న సమాచారం ప్రకారం బీర్ తాగడం వలన పురుషులకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

బీర్ ఏదో కొంచెం పరిమితంగా తీసుకుంటే ఓకె గానీ, అపరిమితంగా తీసుకుంటే మాత్రం  నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా చేసిన ఒక  అధ్యయనం ప్రకారం శృంగారంలో పాల్గొనే ముందు కొంత మంది మహిళలకు మరియు పురుషులకు బీర్ ను ఇచ్చారట. అయితే బీర్ తీసుకున్న తర్వాత మహిళలలో ఎటువంటి ఎఫెక్ట్ లేదని వీరు గమనించినట్లు తెలిసింది.  అదే పురుషులలో మాత్రం బీర్ తాగిన తర్వాత శృంగార సామర్థ్యం పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది. అంతే కాకుండా నపుంసకులు బీర్ తీసుకుంటే ఆ ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని వీరు చెబుతున్నారు.

అయితే ఇక్కడ ఒక సంకటం ఏర్పడే ప్రమాదం ఉందని వీరు చెబుతున్నారు. నపుంసకత్వం సమస్య పూర్తిగా తొలగిపోవాలని ఎక్కువగా బీర్లు తాగితే మాత్రం అంగం స్థంభన సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తెలుపుతోంది. కాబట్టి బీర్ ను చాలా పరిమితంగా మాత్రమే సేవించాలని చెబుతున్నారు. కాబట్టి యువకులు అందరూ ఆలోచించి బీర్ ను తక్కువగా మాత్రమే తాగండి. వీలైతే మానేయండి. మద్యం తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం  మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: