గర్భిణి స్త్రీలు... ప్రతిరోజు తమ తమ ఆరోగ్యంపై ఖచ్చితంగా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొన్ని వైద్యులు చెప్పిన సూచనలు పాటించడం గర్భిణీ స్త్రీలకు కచ్చితంగా అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపై.. కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే అది తింటే కడుపులో ఉన్న బిడ్డకు అనేక సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకూ గర్భిణి స్త్రీలు ఆహారం తీసుకోవాలి. విటమిన్స్ మరియు పోషకాలు సమృద్ధిగా లభించే ఎటువంటి ఆహారం తీసుకుంటే కడుపులో బిడ్డ తో సహా గర్భిణీ స్త్రీలు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి : గర్భిణీ స్త్రీలకు వెల్లుల్లి మంచి ఆరోగ్యమైన ఆహారం గా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లో ఉన్న గ్యాస్ట్రిక్ సమస్యలను ఈ వెల్లుల్లి... చెక్ పెడుతుంది.  ఈ వెల్లుల్లిలో ఉండే సల్ఫర్.. గర్భిణీ స్త్రీలో ఉన్న వేడిని బయటికి తీస్తుంది. తద్వారా ఇమ్మ్యూనిటి శక్తి కూడా గర్భిణులకు పెరుగుతుంది.

అల్లం : గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీలకు వాంతులు మరియు ఓకారం ఎక్కువగా వస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పరగడుపున అల్లం తింటే చాలా మంచిది. చిటికెడంత అల్లం తీసుకుంటే సరిపోతుంది.

పసుపు : పసుపు.. ఎంత మంచి ఔషధం మనందరికీ తెలిసిందే. యాంటీవైరల్ మరియు యాంటిసెప్టిక్ గుణాలు కలిగి ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. గర్భిణీ స్త్రీలు.. ప్రతిరోజు ఉదయం.. పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని... తాగాలి. దీని ద్వారా గర్భిణీ స్త్రీలకు జలుబు మరియు దగ్గు సమస్యలు దరికి చేరవు.

ఉసిరి : మనం ముసిరి తీసుకోవడం కారణంగా శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ఉసిరికాయ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ కు సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దీని ద్వారా రోగ నిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: