కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించేలా చేస్తోంది. ఇప్పటికే భారత్ లో కూడా కొత్త వేరియేషన్ NB 1.8.1 పాటు LF 7 వంటి వైరస్లు వ్యాప్తి చెందుతున్న దీంతో ప్రజలు మళ్ళీ అప్రమత్తం  కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కోవిడ్ వల్ల శరీరంలో వివిధ అవయవాల పైన ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పటికే చాలామంది వైద్యులు తెలియజేశారు. అంతేకాకుండా గతంలో వచ్చిన కరోనా చాలామందిని గుండెపోటుకు గురయ్యేలా చేస్తోంది. వీటివల్ల చాలామంది మరణించారని ఇప్పటికి ఎంతోమంది  వైద్య అధికారులు తెలుపుతున్నారు.


కరోనా వైరస్ వ్యక్తి యొక్క శరీర ప్రతిస్పందనను బట్టి మారుతూ ఉంటుందట.. కొంతమందికి తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ మరి కొంతమందికి చాలా సమస్యలుగా మారుతాయట.


జ్వరము , గొంతు మంట , ముక్కు దిబ్బడ, వాసన, రుచి కోల్పోవడం, శరీర నొప్పులు, తలనొప్పి, జాతిలో ఒత్తిడి, పొడి దగ్గు వంటివి సాధారణ లక్షణాలు.


ఇక తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే.. శ్వాస ఆడక పోవడం, నిద్రలేమి సమస్య, చర్మం రంగు మారడం, జాతిలో నొప్పిగా అనిపించడం వంటివి.



కోవిడ్ వైరస్ మొదటిగా శ్వాస కోస వ్యవస్థ పైన దాడి చేస్తుంది. ఆ తర్వాత ముక్కు, నోరు, కళ్ళ ద్వారా ప్రవేశించి ఊపిరితిత్తుల వరకు చేరుతుందట. అక్కడ శ్వాస కోసం ఇబ్బందులను కలిగించేలా చేస్తుంది. దీనివల్ల న్యుమోనియా, హైపోక్సియా వంటి సమస్యలను తీసుకువస్తుంది.


కోవిడ్ వైరస్ రక్తంలో ప్రవేశించిన వెంటనే .. రక్తం గడ్డ కట్టి ప్రమాదం ఎక్కువగా ఉంటుందట దీనివల్ల గుండెకు రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


కరోన వైరస్ వల్ల ఎక్కువగా నరాల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. ముఖ్యంగా తలనొప్పి వేయడం, రుచి వాసన కోల్పోవడం వంటివి జరుగుతాయి, దీర్ఘకాలిక మెమోరీలాస్ వంటివి కూడా ఏర్పడతాయట.



ఇక జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం ఎలా ఉంటుందంటే వాంతులు విరేచనాలతో పాటు ఆకలి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే కాలేయం వంటి వాటిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

కోవిడ్ తీవ్ర రూపంలో ఉంటే కచ్చితంగా కిడ్నీల పనితీరు పైన ప్రభావం చూపిస్తుందట.

ఇక కీళ్లనొప్పులు దీర్ఘకాలికంగా ఉండవచ్చు.. శరీర నొప్పులు మజ్జు బలహీనత సమస్యలు ఏర్పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: