ఏప్రిల్ 13 వ తేదిన ఒకసారి చరిత్రలోకి వెళ్లి  చూస్తే ఎంతో మంది ప్రముఖులు  జననాలు...  ఎంతో మంది ప్రముఖుల మరణాలు ... ఎన్నో ముఖ్య  సంఘటనలు జరిగాయి. ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం రండి. 

 

 అమెరికాకు మొదటి ఏనుగు : భారతదేశం నుంచి పంపిన ఏనుగు అమెరికా చేరింది. 1796 ఏప్రిల్ 13వ తేదీన ఈ ఘటన జరిగింది. అప్పటి వరకు అమెరికా వాళ్ళు ఏనుగు అంటే ఎలా ఉంటుందో  చూసి ఎరుగరు . 

 

 జలియన్వాలా బాగ్ కాల్పులు : 1919 ఏప్రిల్ 13 వ తేదిన పంజాబులోని జలియన్ వాలాభాగ్ లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో  379 మంది మరణించగా 1200 మంది గాయపడ్డారు. 

 

 థామస్ జెఫర్సన్ జననం  : అమెరికా సంయుక్త రాష్ట్రాలు మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ 1743 సెప్టెంబర్ 13 వ తేదీన జన్మించారు. 

 

 న్యాయపతి రాఘవరావు జననం : రేడియో అన్నయ్య ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు న్యాయపతి రాఘవరావు 1905 ఏప్రిల్ 13వ తేదీన జన్మించారు. బాల సాహిత్య వేత్త గా బాలబాలికల శ్రేయస్సుకోసం, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప విద్యావేత్త కలల కోవిదుడు రచయిత న్యాయపతి రాఘవరావు. ఒరిస్సాలోని బరంపురం లో జన్మించిన ఈయన ... రేడియో అక్కయ్య క పేరుగాంచిన న్యాయపతి కామేశ్వరి వివాహం  చేసుకున్నారు. బాల్యం నుంచే పిల్లలపై  ఎంతో ఇష్టం పెంచుకున్న న్యాయపతి రాఘవరావు... వారికి కథలు చెప్పడం... నటించి చూపడాన్ని  ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక క్రమక్రమంగా రేడియో జాకి గా రేడియో అన్నయ్య గా పేరు సంపాదించాలనే రాఘవ రాజు. రేడియో జాకీ గా ఎన్నో  పాత్రలను సృష్టించారు ఈయన . 

 


 బుర్ర కమలాదేవి జననం : ప్రాచీనాంధ్ర ఆంగ్ల  సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బుర్ర  కమలాదేవి 1908 ఏప్రిల్ 13వ తేదీన జన్మించారు. కమలాదేవి రచించిన చందో హంసి   పోస్ట్ గ్రాడ్యూవెట్ స్టడీస్ కి  ఎంతగానో ప్రాచుర్యం చెందింది. శ్రీ వైశాఖ వెంకటాప్రభుదయం,  చందు హంసి, నిగమాంతర  కవితోపములు రచనాలు రచించారు బుర్ర కమలాదేవి. 

 

 సీమాస్  హీని  జననం  : సుప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత నోబెల్ బహుమతి గ్రహీత అయిన సీమాస్  హినీ  1989 ఏప్రిల్ 13వ తేదీన జన్మించారు. 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి సంపాదించారు. 1960లో 11 కవితలు పేరిట తొలి కవితా సంపుటి విడుదల చేశారు. 1966 లో విడుదల చేసిన డెత్ ఆఫ్  నేచురలిస్ట్ అనే కవిత ఈయనకు  ఇంగ్లీషు సాహిత్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈయన రచించిన రచనలు రాసిన కవితలు ప్రజాదరణ పొందాయి. 2013 ఆగస్టు 30వ తేదీన ఈయన  అనారోగ్యం సమస్యతో  మరణించారు. 


 విద్యా ప్రకాశానందగిరి స్వామి జననం : ఆధ్యాత్మికవేత్త శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మాశ్రమం  స్థాపకులు బహుభాషా కోవిదులు అయిన విశాఖ ప్రకాశానందగిరి స్వామి 1914 ఏప్రిల్ 13వ తేదీన జన్మించారు. ఈయన వైద్ధాంతభేరి స్థాపకులు . మలయాళ స్వామి దగ్గర శిష్యుడిగా చేరారు. అక్కడ ఆధ్యాత్మిక జీవితానికి పెంపొందించుకున్నారు. 1950లో శ్రీకాళహస్తిలో శ్రీ శుక్ర  బ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి ప్రజలో  ఆధ్యాత్మికతను కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆశ్రమం తరపున  పత్రికలు ప్రచురించడం మొదలు పెట్టారు. 

 

 దుద్దిళ్ళ శ్రీపాదరావు మరణం  : ప్రముఖ శాసనసభ్యుడు శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు  1999 ఏప్రిల్ 13వ తేదీన మరణించారు, 

 

 వాసిరెడ్డి సీతాదేవి మరణం : తెలుగు కథా రచయిత అయిన వాసిరెడ్డి సీతాదేవి 2007 ఏప్రిల్ 13వ తేదీన మరణించారు. వాసిరెడ్డి సీతాదేవి రచించిన రచనలు రాసిన కథలు నవలలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి.


 ధూళిపాళ సీతారామ శాస్త్రి మరణం : తెలుగు నాటకరంగంలో తెలుగు సినీ రంగంలో తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన దూలిపాల సీతారామ శాస్త్రి. తెలుగు నాటక చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా  పేరు తెచ్చుకున్నారు ... జీవిత చరమాంకం శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామశాస్త్రి. 2007 ఏప్రిల్ 13వ తేదీన ఆయన మరణించారు

మరింత సమాచారం తెలుసుకోండి: