ఒక కాకి తాటి చెట్టుపై కూర్చోని మర్రి పండును తినుచుండెను పండులోని ఒక గింజ రాలి తాటి మట్టల మధ్య పడింది. ఆ చిన్న విత్తను చూచి ఎగతాళిగా కిలకిల నవ్వింది తాటిచెట్టు. ‘‘నా కాయలు ముంతడేసి, గింజలు చారెడేసి ఉన్నాయి. ఇనుపగుండ్ల లాంటి నా కాయలను చూస్తే అందరికి భయమే !      అదుకే నా నీడన ఒక్కరు కూడా నిలబడరు. మనషులు గానీ, జంతువులు గానీ నా కాయరాలపడ్దే వారి నడ్డి విరిగిపోతుంది. చీమకాలంత ఉన్న ఈ చిన్న గింజనుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది? జానా? లేక మూరా? పక్కనే వున్న నన్ను చూసి ఎంత భయపడునో నా కాయపడి నలిగిచస్తుంది.’’ అని తాటిచెట్టు ఆ మర్రి గింజమీద జాలిపడి రకరకాలుగా నవ్వుకుంది.     ఎగతాళి చేసింది. కాకి ఎగిరిపోయింది. అలా కొంతకాలం జరిగింది. మర్రి విత్తనం మాటకూడ మరచిపోయింది తాటిచెట్టు. వర్షాకాలం తరువాత మర్రిగింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. సంవత్సర గడిచింది. మర్రిచెట్టు మరింత పెద్దగా పెరిగింది. కొంతకాలానికి తాటిని మించి పెద్దగా పెరిగింది. మర్రిచెట్టు. తాటి చెట్టుకు తావడమైనట్టు పెరిగింది. మర్రిమాను. విర్రవీగిన తాటిచెట్టు కొంతకాలానికి మర్రిమాను కౌగిటిలో ప్రాణాలు విడించింది. ఈ కథలోని నీతి: ధనముందని, బలముందని అహంకారముతో మంచివారిని కించపరిస్తే తుదకు ఇదే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: