పిల్ల‌లు ఈ మ‌ధ్య కాలం ఎక్కువ‌గా ఇంట్లో ఉండే స్మార్ట్ ఫోన్ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. ఎంత చిన్న పిల్ల‌లైనా స‌రే ఫోన్ లేక‌పోతే ఉండ‌డం లేదు. ఎంత గుక్క‌పెట్టి ఏడ్చినా ఎంత మారాం చేసినా ఒక్క ఫోన్ ఇస్తే చాలా దెబ్బ‌కి ఏడుపు ఆపేస్తారు. అంత‌లా పిల్ల‌లు ఫోన్ల‌కి అడిక్ట్ అవుతున్నారు. కొంత మంది పిల్ల‌లైతే ఏకంగా పెద్ద‌వాళ్ళ‌క‌న్నా కూడా ఎక్కువ ఫోన్ల‌ను వాడేస్తుంటారు. అలాగే వాళ్ళ‌కి తెలియ‌ని టెక్నిక‌ల్ ఆఫ్‌ష‌న్స్ అన్నీ కూడా వీళ్ళ‌కే ఎక్కువ‌గా తెలుస్తుంది. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ అంత ఫాస్ట్‌గా ఉంద‌ని చెప్పాలి. బాల్యంలో పిల్లలకు మానసిక, శారీరక ఎదుగుదల తప్పనిసరి అని డాక్టర్లు చెబుతుంటారు.   నలుగురితో ముచ్చటించినప్పుడే సామాజిక నైపుణ్యాలు వృద్ధి చెంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయి. భావోద్వేగాలను పంచుకున్నప్పుడే అనుభూతుల రుచి తెలుస్తుంది. ఇతరులు చెప్పేది ఓపిగ్గా విన్నప్పుడే చక్కటి భాష అలవడుతుంది. ఆరుబయట ఆడుకున్నప్పుడు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభిస్తుంది. 

 

అయితే మితిమీరిన టెక్నాలజీ వాడకం వల్ల.. వీటన్నిటికీ దూరమ‌య్యారు నేటి పిల్ల‌లు.  కాబట్టి వాటికి పిల్ల‌ల‌ను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కొన్ని పద్దతులు అవలంభిస్తే వారు ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం. ఫోన్‌కి బ‌దులుగా ప్రత్యామ్నాయ మార్గాలు టీవీ, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్లను పిల్లలు చూసేందుకు నిర్ణీతవేళల్ని నిర్దేశించాలి. ఆ ప్రణాళికను పెద్దలు కూడా విధిగా పాటించాలి. అప్పుడే పిల్లల్లో ఆశించినంత మార్పు వస్తుంది.  'చూడొద్దు.. చూడొద్దు..' అంటూ ఎంత గట్టిగా అరిచి గీపెట్టినా పిల్లలు మానరు. పాత బొమ్మలతో ఆడుకోమన్నా బోర్‌గా ఫీలవుతారు. అందుకని చౌకధరల్లో దొరికే సరికొత్త బొమ్మల్ని వారానికి ఒకసారి కొనివ్వాలి. అప్పుడే పిల్లల్లో టాయ్స్‌తో ఆడుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది.. ఇంటి పనుల్లో భాగస్వామ్యం పిల్లలను ఇంటి పనుల్లో భాగస్వాములను చేయాలి. వంటింట్లో అమ్మ చపాతీ చేస్తుందనుకోండి. పిల్లలను కూడా సరదాగా చపాతీ ఒత్తమని కాస్త పిండి ముద్దను చేతికి అందివ్వాలి. అది పాడవుతుందని పిల్లల్ని దూరం పెట్టొద్దు. 

 

పిల్లల అల్లరి భరించలేక.. వాళ్ల చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి ఆడుకోమనడం తప్పు. అదే అలవాటుగా మారుతుంది. మళ్లీ ఆ అలవాటును మాన్పించడం తల్లిదండ్రు లకీ పెద్ద ప్రయాస అవుతుంది. పెద్దలు చేసే పనుల్లో పిల్లలు.. పిల్లలు చేసే పనుల్లో పెద్దలు కలిసిపోయే వాతావరణాన్ని కలిగించాలి. పిల్లలు చెప్పే మాటల్ని తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలి. వెంటనే స్పందించాలి. అప్పుడే ఇద్దరి మధ్యా బంధం బలపడుతుంది. టెక్నాలజీ మరపు సాధ్యం అవుతుంది.   పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.. తల్లిదండ్రులు ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నా పిల్లల అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ ఉండాలి. సెల్‌ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల వల్ల కలిగే అనర్థాలను వారికి తెలిజెప్పడం ద్వారా వారిని వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వైపు దృష్టి మళ్లకుండా వివిధ రకాల పుస్తకాలను చదివేలా చేయాలి. శారీరక ఎదుగుదల కు తోడ్పడే క్రీడల వైపు వారి దృష్టిని మళ్లించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: