మీ పిల్లలకు అసలు కధలు అంటే ఏంటో తెలుసా..? చాలా మంది నుంచి వచ్చే సమాధానం తెలియదు అని.. కధలు తెలియదు అని.  అదే ఫోన్ అన్నగాని, యూ ట్యూబ్ అన్నాగాని, కంప్యూటర్ అన్నాగాని, వీడియో గేమ్స్ అన్నాగాని అంటే తెలుసు అనేస్తారు..అంతేకాని కధలు అంటే ఎవరికీ తెలియదు. పిల్లలను అలరించడానికి ఒక ఫోన్ ఇచ్చేస్తే చాలు అందులో వారు ఏం చేసుకున్నా కూడా మనకు అడ్డురాకుండ ఉంటే చాలు అని అనుకునేవారు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు  చేసే ఇలాంటి పనుల వలన చిన్నతనంలో నే పిల్లలలో నేర పూరిత ఆలోచనలు , ప్రవృత్తి, సైబర్ నేరాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు .



పిల్లలకు కధలు చెప్పడం వలన చిన్నతనంలోనే వారికి  అనేక విషయాలపైనా అవగాహన కలుగుతుంది. ఎలా ప్రవర్తించాలి, నీతిగా ఎలా బతకాలి, ప్రతీఒక్కరికి ఎలా సహాయం  చేయాలి, దాని వలన ఎలాంటి తృప్తి కలుగుతుంది, లాంటి విలువలు వారు కథలతో  అర్ధం చేసుకుని ఆచరిస్తారు. అయితే చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. మా పిల్లలు ఫోన్లో  మంచి కథలు  చూస్తున్నారు వింటున్నారు. ఇంకా మేము ఏమి కధలు చెప్పాలి అని అంటారా … అది చాల పొరపాటు. ఫోన్లో చూసేది వేరు.. మనం వాళ్ళకి చెప్పేది వేరు. మీరు స్వయంగా భావప్రకటన తో  కథలు చెప్తూ  చిన్న చిన్న ప్రశ్నలు  వేస్తూ  జవాబులు  రాబడుతూ చెప్పి చూడండి అది వారికీ మీకు మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.ఫోన్లో కధలు చూసినపుడు వాళ్ళకి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అప్పుడు పిల్లలు ఎవరిని అడుగుతారు చెప్పండి. అందుకనే పిల్లలకు మీరే కదా చెప్పండి.



దీనివల్ల తల్లీదండ్రులతో వారికి ఓ మంచి బంధం ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మనచుట్టూ  ఉన్న మనుషులు గురించి, సమాజ  కట్టుబాట్లు, ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని కథల రూపంలో చెబితే.. వారికీ అందమైన భవిష్యత్‌ని ఇచ్చినట్టవుతుంది. డబ్బు సంపాదించడం ముఖ్యమే కావొచ్చు.కానీ అది కుటుంబం, పిల్లలకంటే ముఖ్యం కాదు అని గుర్తు పెట్టుకోవాలి. ఎంత డబ్బు సంపాదించినా కూడా పిల్లలను విలువలతో పెంచక పొతే అదంతా వృథా అనే చెప్పాలి. కాబట్టి ఎంత  తీరిక లేకుండా ఉన్న రాత్రి పడుకునేముందు పిల్లలతో గడపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: