పై ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు మాలావత్‌ పూర్ణ. ఎక్కడో ఓ మారుమూల గిరిజన గ్రామంలో జన్మించింది. ఒక వసతి గృహంలో ఉంటూ తన ఎనిమిదొవ తరగతి చదివే రోజుల్లో.. ఆర్థిక పరిస్థితుల వలన ఎక్కడ తన చదువు ఆపేవాల్సి వస్తుందేమోనని.. పర్వతారోహణ సాధన మొదలుపెట్టింది. మొదట భువనగిరి గుట్టలను ఎక్కడం నేర్చుకున్న ఈ బాలిక ప్రస్తుతం ప్రపంచంలోని ఆరు ఖండాల్లో ఎత్తయిన పర్వతాలను ఎక్కి రికార్డులను బద్దలుకొట్టింది. ఇంకొక ఖండంలో ఉత్తర అమెరికాలోని ‘డెనాలి’ శిఖరాన్ని అధిరోహిస్తే ఆమె తన లక్షాన్ని ఛేదిస్తుంది.


చాలా మంది పొద్దునే లేచి అత్యంత సులువైన జాగింగ్ చేయడానికే వామ్మో వాయ్యో అంటారు. అలాంటిది ఓ సుదీర్ఘ లక్ష్యంతో ఆరు సంవత్సరాల పాటు ఆరు ఖండాల్లోని అతి ఎత్తయిన శిఖరాలని అధిరోహించిందంటే ఎంత పట్టుదల, ఎంత శారీరక శ్రమ కావాలో అర్ధమవుతుంది. నిజానికి ఇదీ అసలైన పట్టుదల అంటే..


పూర్ణ ఇప్పటివరకు ఎవరెస్టు, అకాంకాగువా, కిలిమంజారో, ఎల్‌బ్రస్, పుంకాక్ జయ, విస్సన్‌ మసిఫ్‌ పర్వతాలపై తన పాదాలను మోపి సగర్వంగా మన జాతీయ పతాకాన్ని ఎగరవేసింది.


2014లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ.. 2019 డిసెంబర్ 26న అంటార్కిటికా ఖండం లోని 16,050 అడుగుల ఎత్తులో ఉన్న విస్సన్‌ మసిఫ్‌  శిఖరమును పాదాక్రాంతం చేసుకుంది.


సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఈమె 20 సంవత్సరాల లోపు ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలన్న గొప్ప లక్ష్యంతో మొదటడుగు వేసిన పూర్ణ.. ఇప్పటికే ఆరు ఖండాలలోని శిఖరాలను అధిరోహించి ఎంతోమంది గిరిజన బాలికలకు స్ఫూర్తిదాయకం అయింది. తను మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫుల్ సపోర్టు వలనే తాను ఈ రికార్డులన్నీ సాధించానని, తనలాంటి పేదలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన ధన్యవాదములు అని చెప్పుకొచ్చింది.


మన తెలుగు అమ్మాయి ప్రపంచ పర్వతారోహకురాలిగా అతి తక్కువ మంది సాధించే లక్ష్యాలను ఛేదించడం మనకి గర్వకారణమని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: