మనం తినే పద్ధతి విధానం కూడా మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మన పూర్వికులు ఒక చక్కటి పద్ధతిలో భోజనం చేసేవారు. అందుకే వాళ్ళు వందల ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు.ఆహారాన్ని తినడానికి కూడా నియమాలు ఉన్నాయి. మూడు రోటీలను ఎప్పుడూ ఒక ప్లేట్‌లో కలిపి వడ్డించవద్దు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. మూడు రొట్టెలతో కూడిన ప్లేట్ మరణించినవారికి అంకితం చేయబడిందని నమ్ముతారు.త్రయోదశి వ్రతం ముందు మరణించినవారికి నైవేద్యంగా 3 రొట్టెలు ఉంచాలని పెద్దలు అంటారు.మీరు తినగలిగినంత మాత్రమే ఆహారాన్ని ప్లేట్‌లో తీసుకోండి. ఎందుకంటే చాలా మంది ఒకేసారి అన్నింటిని తీసుకొని వదిలివేస్తారు. ఇలా చేయడం సరికాదు.. ఆహారాన్ని వృధా చేయడం అంటే అన్నపూర్ణ దేవిని అగౌరవపరచడమే. ముందుగా మీరు ఆహారం ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. దానిని వదిలివేయవద్దు.చిన్నప్పటి నుంచి ఇళ్లలో, పాఠశాలల్లో భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలని నేర్పుతున్నారు. మురికి చేతుల్లోని క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ఇలా చేయాలి.


మనకు పాత కాలం నుంచే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అదేవిధంగా, ఆహారం ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం అస్సలు మంచిది కాదు.అలాగే భోజనం చేసేటప్పుడు పూర్తిగా నేల మీద కూర్చొని తినాలి. పూర్తిగా కింద కూర్చొని తినడం వల్ల జఠర రసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి శరీరానికి త్వరితగతిన శక్తి లభిస్తుంది.ఇలా కింద కూర్చొని భోజనం చేసే సమయంలో మన ప్లేట్ కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.ఇక రెండవది పాలు పితికే భంగిమలో కూర్చొని తినడం. ఈ భంగిమ శారీరక శ్రమ చేసే వారికి ఉత్తమమైనది. పొట్ట ఉన్న వారు ఈ భంగిమలో కూర్చొని తింటే వారి పొట్ట నెమ్మదిగా తగ్గుతుంది. ఇలా తినడం అలవాటు చేసుకుంటే శరీరం, మనసు నిత్య యవ్వనంగా ఉంటాయి.కొందరు నిలబడి భోజనం(బఫే) చేస్తూ ఉంటారు. నిలబడి భోజనం చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోవడంతో పాటు అసిడిటీ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ పద్ధతులతో భోజనం చేస్తే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: