ఇటీవలే కాలంలో రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ అటు మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో ఊహించని మార్పులకు కారణం అవుతుంది అని చెప్పాలి. వెరసి ఇక ట్రెండుకు తగ్గట్లుగానే మనిషి తన లైఫ్ ను మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఇకపోతే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో ఉండే.. ఈ కామర్స్ యాప్ లలో బుక్ చేసుకుని ఇంటి వద్దకే డెలివరీ పొందుతున్నారు. కేవలం వస్తువులు మాత్రమే కాదు తినే ఆహారం వరకు కూడా ప్రతి ఒక్కరు ఇలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంటి వద్దకు డెలివరీ పొందడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 మొన్నటి వరకు కేవలం డబ్బులు చెల్లించిన వారికి ఇలా ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఎన్నో ఈ కామర్స్ సంస్థలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. బై నౌ పే లేటర్ అనే ఆఫర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు కొనుక్కుని  తర్వాత సమయానుగుణంగా ఆ నగదును చెల్లించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఆఫర్లు వినియోగించుకుంటూ ఎంతో మంది తమకు కావలసిన వస్తువులను డబ్బులు లేకపోయినా సరే కొనుగోలు చేయడం చూస్తూ ఉన్నాం.


 అయితే ఆన్లైన్లో ఉండే చిన్న చిన్న వస్తువులు మాత్రమే కాదు ఏకంగా మనిషి జీవితంలో ప్రత్యేకమైన పెళ్లిని కూడా ఇలా పే లేటర్ ఆఫర్లు చేసుకోవచ్చు అన్నది తెలుస్తుంది. పెళ్లి చేసుకోండి దీనికి కూడా లోన్ ఇస్తాం అంటున్నాయ్ కొన్ని కంపెనీలు. పెళ్లి ఖర్చులకోసం పొదుపు చేసిన డబ్బులను యూస్ చేయకుండా.. లోన్ ఇస్తామని ఇక ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు అంటూ ఆఫర్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి. ఈ ఆఫర్ ఏదో బాగుందే అని ఎంతోమంది యూత్ ఈ ఫోటోలు చూసి అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: