మన ఆరోగ్యానికి ఓట్స్ చాలా రకాలుగా మేలు చేస్తాయి.ఇక వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో ఇంకా అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే ఈ ఓట్స్ తో చక్కటి రుచికరమైన స్మూతీని తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవడం వల్ల మనం ఈజీగా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ స్మూతీని తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మెదడు చాలా చురకుగా పని చేస్తుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే రక్తహీనత తగ్గుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మనం ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ ను తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో బాదంపప్పును వేసుకోవాలి. ఇంకా అలాగే ఖర్బూర పండ్లల్లో ఉండే గింజలను తీసేసి వాటిని కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి.ఆ తరువాత ఇందులో అర కప్పు పాలు పోసి అర గంట పాటు నానబెట్టాలి. ఇక ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఆపిల్ ముక్కలు, చియా విత్తనాలు, మరో అర కప్పు పాలు, తేనె ఇంకా దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసి పైన చియా విత్తనాలు అలాగే తరిగిన డ్రైఫ్రూట్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. అయితే షుగర్ ఉన్న వారు మాత్రం ఇందులో తేనెను వేసుకోకపోవడం మంచిది. దీనిని ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే నీరసం మన దరి చేరుకుండా ఉంటుంది. ఇంకా శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. ఇంకా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరం బలంగా ఇంకా ధృడంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: