డైనింగ్ టేబుల్‌పై డీప్ ఫ్రై చేసిన వంటకాలు కనపడగానే నోరు ఊరిపోతుంది. అటు ఇటు ఆలోచించకుండా లాగించేస్తుంటాం. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ వంటకాలను తినడం చాలామందికి ఇష్టం. కానీ ఈ రుచికరమైన ఆహారం వెనుక చాలా ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయి. డీప్ ఫ్రై చేసిన వంటకాలను ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

ఈ వంటకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగి మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇలా డీప్ ఫ్రై చేసిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి, ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ఊబకాయం అనేది గుండె జబ్బులు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రధాన కారణం.

నూనెలో వేయించిన వంటకాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, బంగాళాదుంపల చిప్స్‌లో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. డీప్ ఫ్రై చేసిన వంటకాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో మంట (inflammation) పెరుగుతుంది. ఈ మంట వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం, వేయించిన ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

అందుకే డీప్ ఫ్రై చేసిన వంటకాలకు బదులుగా కాల్చిన, ఉడికించిన, ఆవిరితో ఉడికించిన ఆహార పదార్థాలను తినడం మంచిది. మీ ఆరోగ్యం కోసం ఈ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం. డీప్ ఫ్రై చేసిన వంటకాల వల్ల  దీర్ఘకాలంలో లాభం కంటే నష్టాలూ ఎక్కువగా  కలిగే అవకాశాలున్నాయి.  డీప్ ఫ్రై చేసిన  ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే  ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: