సాధారణంగా ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే ఆ సినిమా సీక్వెల్ వస్తున్నప్పుడు కచ్చితంగా అందులో కీలకమైన నటీనటులు నటిస్తూ ఉంటారు. అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర కీలకం కానీ అఖండ 2లో ఎందుకు తొలగించారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.. ఈ పాత్ర తొలగింపు వెనుక డైరెక్టర్ బోయపాటి శ్రీను నిర్ణయం ఉందా ?లేకపోతే కథపరంగా ఏదైనా తొలగించారా అన్న విషయం పై స్వయంగా నందమూరి బాలకృష్ణ అనే అసలు విషయాన్ని బయటపెట్టారు.
అఖండ 2 చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర తొలగింపు వెనుక ఉన్న కారణాన్ని బాలయ్య వివరణ ఇచ్చారు.. ఈ నిర్ణయం కేవలం పాత్ర ముగింపు పైన ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్రకు సంబంధించి కథ పూర్తి అయ్యిందని, ఆమె పోషించిన కలెక్టర్ పాత్రకు ఆ సినిమాలోనే ఒక ముగింపు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సాధారణంగా సీక్వెల్స్ లలో,మొదటి భాగం కథలో సజీవంగా ఉండే పాత్రలను మాత్రమే కొనసాగిస్తారు. అఖండ స్టోరీ పరంగా ఆ కలెక్టర్ పాత్రకు సంబంధించి అన్ని అంశాలను కూడా మొదటి భాగంలోనే పూర్తి అయ్యాయి. అందుకే అఖండ 2 సినిమాలో ఆమె పాత్ర అవసరము లేదు ఆ కారణంగానే రెండవ భాగంలో ఆమెను కొనసాగించలేదని బాలయ్య తెలియజేశారు.
దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ నిర్ణయం వెనుక ఎటువంటి విభేదాలు కాని వ్యక్తిగత కారణాలు లేవని కేవలం సినిమా కథ, సహజత్వం కోసమే తీసుకున్న నిర్ణయం అని కనిపిస్తోంది. అందుకే కొత్త కొత్త పాత్రలు కొత్త నటి నదులను తీసుకున్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి