ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉండగా యూరియా కొరత వల్ల రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు సైతం యూరియా కొరత వల్ల పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ  కావు.  అధికారులు యూరియా కొరత లేదని చెబుతుంటే రైతులు మాత్రం బస్తా యూరియా కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వ ఆదేశాలతో విజి లెన్స్‌ రంగంలోకి దిగగా  పిఠాపురంలోని  పలు మండలాల్లో యూరియా పక్కదారి పడుతోందని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

అధికారులు తనిఖీలు చేపట్టగా తాటిపర్తి గ్రామ శివారులో వన్నెపూడి రోడ్డు లో యూరియా లోడుతో రెండు లారీలు కనపడ్డాయి.  డిప్యూటీ సీఎం ఇలాకాలో యూరియా అక్రమ దందా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయింది.   రైతులకు ఎక్కువ ధరకు విక్రయించడానికి కొన్ని షాపుల రైతులు ఈ విధంగా చేశారని తెలుస్తోంది.  

యూరియా అక్రమ రవాణా, బ్లాక్‌మార్కెట్‌ చేసి అధిక ధరలకు విక్రయించడం, ఈపోస్‌ యంత్రాలను దుర్వినియోగం చేసి రైతుల వేలిముద్రలు సేకరించి రికార్డులను తారుమారు చేయడం గురించి అధికారులకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.  ఏవో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు యూరియాను పక్కదారి పట్టించిన వ్యక్తులపై అధికారులు కేసులు నమోదు చేశారని సమాచారం అందుతోంది.

 దుకాణాల నిర్వాహకులు తమ దగ్గరకు వచ్చిన స్టాకును లారీని ఎక్కడో ఒకచోట నిలిపి 400 రూపాయల చొప్పున  విక్రయించారు.  యూరియా సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉన్నామని  ప్రభుత్వం నిర్ణయించిన  ధర కంటే  ఎక్కువ ధరకు యూరియా విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: