భాద్రపద మాసం పూర్తి అయిన తర్వాత వచ్చే అమావాస్యనే 'మహాలయ అమావాస్య' అని పిలుస్తారు. సాధారణ అమావాస్య కంటే మహాలయ అమావాస్య గురించి పండితులు సైతం ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. ఈ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణం చేయడం వల్ల చాలా సంతోషిస్తారని చెబుతూ ఉంటారు. అయితే కొందరు మహాలయ అమావాస్య రోజున మాంసాహారాలను వండి పెట్టాలనుకుంటారు. కానీ పండితులు సైతం ఈరోజు మాంసాహారం తినవద్దని చెబుతున్నారు మరి ఎందుకో ?ఒకసారి చూద్దాం.



మహాలయ అమావాస్య రోజున పూర్వీకుల కోసం ప్రత్యేకించి మరీ పూజలు చేయిస్తుంటారు. అలా పూజ పూర్తి అయిన తర్వాత  ఆహార పదార్థాలను వడ్డించి పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో మాంసాహారాలను వండి పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల అశుభం జరిగే అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి మరణించాక .. ఆ వ్యక్తిని దేవుడిగా భావిస్తూ ఉంటాము. కనుక అలా దేవుళ్ళుగా భావించే వారికి మనం మాంసాహారాలను పెట్టకూడదు. వారితో ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది కనుక వారికి సాత్విక ఆహారాన్ని మాత్రమే వండి పెట్టాలి.

మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం సమర్పించుకుంటూ నది స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది.  అలాగే బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం మంచిదని పండితులు తెలుపుతున్నారు. అలాగే కాకులకు,  ఆవులకు భోజనం పెట్టడం వల్ల అవి పితృదేవతలకు వెళ్తాయని కొందరి నమ్మకంతో ఉంటారు. పురాణాల ప్రకారం ఆవు , కాకులు వంటివి మహాలయ అమావాస్య రోజున ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయని చెబుతారు. ఈ మహాలయ అమావాస్య రోజున సాత్విక ఆహారం ఇవ్వడం వల్లే వారు సంతోషిస్తారని మాంసాహారంతో వారు సంతృప్తి చెందరని పండితులు సైతం తెలియజేస్తున్నారు. మరి అత్యంత పవిత్రంగా భావించే ఈ మహాలయ అమావాస్యను సద్వినియోగం చేసుకోవాలని పితృదేవతలను శాంతింప చేసి సకల శుభాలు సొంతం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: