తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఆదుకోవడానికి సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ పాలసీ ఎంచుకున్న వారికి భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని చెప్పవచ్చు. అంతేకాదు రిస్క్ ఉండదు.. టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. పైగా మార్కెట్ నష్టాలు కూడా ఉండవు.. మీకు చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఎల్ఐసి అందిస్తున్న పాలసీలో ఆధార్ చేసుకుంటే భవిష్యత్తుకు ఆర్థిక చింతన లేకుండా ఉండవచ్చు. ఇక ఎల్ఐసి అందిస్తున్న జీవన్ ప్రగతి యోజన అనేది భవిష్యత్తులో ఆర్థిక చింతలు లేకుండా చేయడానికి ఒక మంచి పాలసీ అని చెప్పవచ్చు. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగా సహాయపడుతుంది.

ఈ పాలసీలో మీరు ప్రతి రోజు 200 రూపాయల చొప్పున ఆధా చేస్తూ 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే 28 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అదనంగా 15000 రూపాయల పెన్షన్ కూడా అందించబడుతుంది. పెట్టుబడి పెట్టిన మొదటి ఐదు సంవత్సరాల వరకు రిస్కు కవర్ ఉంటుంది ఇక ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు బీమా రిస్కు కవర్ 25 నుండి 125 శాతానికి పెరుగుతుంది ఇక 15 సంవత్సరాల వరకు రిస్కు కవర్ 150 శాతానికి పెరుగుతుంది అని చెప్పవచ్చు. 20 సంవత్సరాలు చెల్లించి మధ్యలో డబ్బులు విత్డ్రా చేసుకోకుంటే మీకు 200 శాతం రిస్క్ కవర్ లభిస్తుంది.

మీరు రెండు లక్షలకు పాలసీ తీసుకుంటే మొదటి ఐదు సంవత్సరాల పాటు బీమా కవరేజ్ , 6-10 సంవత్సరాల మధ్య రూ.2.5 లక్షలు..11-15 సంవత్సరాల మధ్య రూ.3 లక్షలు, 16-20 సంవత్సరాల మధ్య బీమా  సుమారుగా రూ.4 లక్షల వరకు ఉంటుంది. పాలసీదారుడు మరణించిన లేదా వైకల్యం పొందిన తప్పనిసరిగా బీమా కవరేజ్ అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి కనీస హామీ మొత్తం చెల్లించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: