బాలీవుడ్ లో గత కొంత కాలంగా అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది.  ఆ మద్య నేహాదూపియా నటించిన జూలీ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.   ఈ చిత్రంలోహట్ హాట్ గా లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లు ఉన్నాయి. ఇక నేహా దూపియా కొన్ని సన్నివేశాలు రెచ్చిపోయి మరీ నటించింది. 

'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఐటమ్ బాంబ్ గా దుమ్మురేపుతున్న నటి రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.  అంతే కాదు 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. గ్లామ‌ర్‌తో యూత్‌కి క‌నెక్ట్ అయిన కన్నడ‌ బ్యూటీ రాయ్‌ల‌క్ష్మీ.. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 

రాయ్ లక్ష్మీ నటిస్తున్న  ‘జూలీ 2’ మూవీకి సంబంధించి ‘కోయి హాస్లాతో హో’ అనే సాంగ్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఎడారిలో తెరకెక్కించిన ఈ పాటలో రాయ్‌లక్ష్మి మెరిసింది. బాలీవుడ్‌లోవున్న చీక‌టి కోణంతోపాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా- రాజ‌కీయాలకు మధ్యవున్న రిలేషన్‌ని ఇందులో రివీల్ చేస్తారని యూనిట్ చెబుతున్నమాట.

ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీవాస్తవ‌, ర‌వికిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ దీపక్ శివ్‌దాసాని.


మరింత సమాచారం తెలుసుకోండి: