భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు.  ఆ తరహా ప్రయోగాత్మ చిత్రాల్లో నటించిన హీరో విక్రమ్ ఒక్కడే అనొచ్చు.  ‘ఐ’చిత్రంలో ఏకంగా ఆయన శరీరంపైనే ప్రయోగాలు చేసుకొని ఔరా అనిపించాడు.  ఈ చిత్రంలో కురూపిగా కనిపించడానికి విక్రమ్ చాలా కష్టపడాల్సి వచ్చిందని దర్శకుడు శంకర్ పలు సందర్భాల్లో అన్నారు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్ కి మంచి క్రేజ్ ఉంది. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్.

తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవల సామి 2 చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్ర‌స్తుతం త‌న 56వ సినిమాతో బిజీగా ఉన్నాడు. క‌ద‌రం కొంద‌న్ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ రూపొందుతుంది.  ఆ మద్య దీపావళి సందర్భంగా చేతులు సంకెళ్ళ‌తో బంధించి ఉండ‌గా, నోటిలో నుండి పొగ‌లు విర‌జిమ్ముతున్నాయి.  ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
Related image
న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించిన మ‌రో లుక్ విడుద‌ల చేశారు. ఇందులో విక్ర‌మ్ స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.  ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ జనవరి 15న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌ర్పిస్తున్నాడు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో సౌంద‌ర్య రవీంద్ర‌న్, అక్ష‌ర హాస‌న్ ముఖ్య పాత్రలు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: