
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకులకు మందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ , వీడియో సాంగ్స్ సినిమా ఫై భారీగా అంచనాలను తీసుకొచ్చాయి. తెలుగు సినిమా చరిత్ర లో ముందుఎప్పుడు లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈసినిమాను నిర్మించారు. ఇక సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కు 80కోట్ల వరకు ఖర్చు చేశారట. 12నిముషాల నిడివి గల ఈ ఎపిసోడ్ మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో వావ్ అనిపించేలా వుండనుందట. ఇక ఈచిత్రం నుండి తాజాగా విడుదలైన 'బ్యాడ్ బాయ్' సాంగ్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
కాగా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తుంది చిత్ర యూనిట్. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరా భేడి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి , గురు రాంధావ సంగీతం సమకూర్చగా తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు30న తెలుగు , హిందీ, తమిళ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఇక ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో అయితే ఏకంగా 120కోట్ల కు పైగా బిజినెస్ చేసిందని సమాచారం. ఈలెక్కన తొలి రోజే ఈచిత్రం 40 కోట్ల ఓపెనింగ్ ను రాబట్టాల్సిందే. అయితే అన్ని భాషల్లో సోలో గా విడుదలకానుండడం సాహో కు కలిసిరానుంది.