మళ్లీరావా, దేవదాస్ చిత్రాలతో తెలుగు తెర కు పరిచయమైంది  ఆకాంక్ష సింగ్. ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా ఆమె నటన ప్రేక్షకుల  అభిమానాన్ని సంపాదించుకుంది. 
ఇక  కన్నడ సూపర్ స్టార్.. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన పహిల్వాన్ చిత్రంలో కూడా  హీరోయిన్గా నటించింది. కన్నడలో ఈ  సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. 
ఈ సందర్భంగా ఆకాంక్ష సింగ్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి మనిషిలా ప్రేమిస్తారని అంటోంది. 

 నా మొదటి చిత్రం మళ్లీరావా విడుదలైన వెంటనే.. నా గురించి అందరూ మాట్టాడటం మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకులు అప్పటి నుంచి నాపై అభిమానుం చూపిస్తూనే ఉన్నారు. 
నా ఇన్ స్టాగ్రాంలో ఉన్న ఫాలోవర్స్లో  హైదరాబాద్ వారే ఎక్కువ మంది ఉంటారు. ప్రతీ విషయంలో వారు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు.హైదరాబాద్ నాకు రెండో ఇళ్లులా మారిపోయింది. 
షూటింగ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నానంటే ఏదో తెలియని ఆనందమేస్తుంది.సినిమాలో కనిపించేంది ఐదు నిమిషాలు అయినా సరే.. చూసిన వారు మన గురించి మాట్లాడుకోవాలి. 
 పహిల్వాన్ చిత్రంలో కొంత గ్లామరస్ టచ్ ఉన్న పాత్ర చేయడం ద్వారా  తన నెక్స్ట్ సినిమాల్లో  గ్లామర్ పాత్ర వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నానని సిగ్నల్ ఇచ్చింది.
 
తనకు ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో   బాహుబలి చిత్రంలో అనుష్క చేసిన రోల్స్ వస్తే బాగుండు అనుకుంటోందట. ఐతే తన పై వస్తున్నా రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది.తనకు  పెళ్లైందని..తన  భర్త మూలానే సినిమా అవకాశాలు రావడం లేదనడంలో ఎంత మాత్రం నిజం లేదు అంది.హీరోయిన్లు  పెళ్లైతే సినిమాలు చేయకూడదా? ఇదే ప్రశ్నను మీరు హీరోలను ఎందుకు అడగరు అని ప్రశ్నించింది.ఇక   ఏ సినిమాలో నటించాలి అనే  నిర్ణయం తానే  తీసుకుంటానని, తన భర్త  వల్లే సినిమాలు రావడం లేదనడం కరెక్ట్ కాదని మండిపడింది. 


నిజం చెప్పాలంటే  పెళ్లైన తరువాతే ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తున్నానని దాని కారణం తన భర్త ప్రోత్సాహమే అంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సినిమాల్లో బిజీగా ఉన్న అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లే ఆలోచనే లేదంటోంది.ఏ సినిమా అయినా ఫస్ట్ కథ, క్యారెక్టర్ నచ్చాలి, అలాగే చుట్టూ ఉన్న వాతావరణం కూడా నచ్చితేనే చేస్తాను అంటుంది. 
బయట షూటింగ్ కు ఎక్కడికి వెళ్లినా.. పది రోజుల కంటే ఎక్కువగా ఉండలేని ఆకాంక్ష  హైదరాబాద్ లో  ఎన్ని రోజులైనా ఉండగలదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: