బిగ్ బాస్ సీజన్ 3 కేవలం మరో 10 రోజుల్లో ముగుస్తుంది. నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్ రేసులో ఉన్నాడు. ఇక ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఐదుగురులో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవక తప్పదు. అయితే ఈ వారం నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి.. ఈ వారం రోజులో పడే వోటింగ్ ను బట్టే టైటిల్ విజేతను నిర్ణయిస్తారు కాబట్టి బుల్లితెర యాంకర్లంతా శ్రీముఖిని సపోర్ట్ చేస్తున్నారు.


ఈ క్రమంలో ఇప్పటికే జబర్దస్త్ యాంకర్ రష్మి శ్రీముఖి ఓటు వేయాలని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను కోరింది. శ్రీముఖి బయట ఎలా ఉంటుందో హౌజ్ లో కూడా అలానే ఉందని.. అందుకే ఆమెకు తన సపోర్ట్ అంటుంది రష్మి గౌతం. ఇక జబర్దస్త్ రైటర్ కం కమెడియన్ ఆటో రాం ప్రసాద్ కూడా శ్రీముఖికి తన సపోర్ట్ అందిస్తున్నాడు.


హౌజ్ లో శ్రీముఖి చాలా ఎంటర్టైన్ చేస్తుందై.. టైటిల్ విన్నర్ అయ్యే అర్హత శ్రీముఖికి ఉన్నాయని అన్నాడు రాం ప్రసాద్. వీరే కాదు స్మా స్క్రీన్ యాంకర్స్ అందరు కూడా శ్రీముఖికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ టికెట్ టూ ఫినాలే రేసులో రాహుల్ ఫైనల్స్ కు వెళ్లాడు. మిగిలిన నలుగురులో టాప్ 3లో శ్రీముఖి వరుణ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.


ఇక టైటిల్ విన్నర్ ఎవరన్నది చెప్పడం కష్టమే.. శ్రీముఖికి వచ్చే సపోర్ట్ చూస్తుంటే శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రెండు వారాల వరకు వరుణ్ సందేష్ విజేత అవుతాడని అనిపించగా వితిక బయటకు వెళ్లిన దగ్గర నుండి వరుణ్ గేం లో తన 100 పర్సెంట్ ఇవ్వలేకపోతున్నాడు. దానితోడు ఇన్నాళ్లు పక్కన ఉన్న రాహుల్ కాస్త వరుణ్ తో చీటికి మాటికి గొడవ పడటం వరుణ్ ను ఇబ్బంది పెడుతుంది. మరి ఫైనల్ విన్నర్ ఎవరో ఈ ముగ్గురిలోనే ఉండే అవకాశం ఉందని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: