సినిమాలో కేవలం ఫైట్లు, సాంగ్స్ ఉంటే సరిపోదు కామెడీ కూడా ఉండాల్సిందే. కొందరు హీరోలు తమ క్యారక్టరైజేషన్.. నటనతో కామెడీ పండిస్తే కొందరు మాత్రం తమ సినిమాల్లో సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఈ క్రమంలో తెలుగులో స్టార్ కమెడియన్స్ కు మంచి డిమాండ్ ఉంది. కమెడియన్స్ లేనిదే సినిమాలు లేవన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దశాబ్ధంలో కొందరు కమెడియన్స్ ఛాన్సులు లేక కనుమరుగయ్యారు. 

 

కొన్నాళ్లుగా సూపర్ హిట్ కమెడియన్ గా.. స్టార్ సినిమా అయినా సరే అతను ఉండాల్సిందే అనేట్టుగా క్రేజ్ తెచ్చుకున్న బ్రహ్మానందం ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే కొత్త కమెడియస్ రాకతో పాత వారికి పెద్దగా డిమాండ్ ఉండదు. ఈమధ్య బ్రహ్మికి అవకాశాలు రావట్లేదు. ఆయనకు బై పాస్ సర్జరీ కూడా జరగడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

    

ఇక ఒకప్పుడు సూపర్ కామెడీతో అలరించిన కృష్ణ భగవాన్ కూడా ఈమధ్య కాలంలో పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. ఈమధ్య సినిమాల్లో కృష్ణ భగవాన్ పెద్దగా కనిపించట్లేదు. ఇక ఒకప్పుడు విలన్ గా అలరించి ఆ తర్వాత కమెడియన్ గా చేస్తూ వచ్చిన జయప్రకాశ్ రెడ్డి ఈమధ్య బొత్తిగా సినిమాల్లో కనిపించట్లేదు. స్టార్ కమెడియన్ గా సూప్ర్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ కూడా కమెడియన్ గా మానేసి హీరోగా ట్రై చేశాడు.. అయితే హీరోగా టర్న్ తీసుకున్న మొదట్లో సక్సెస్ అయిన సునీల్ తర్వాత ఫ్లాపులు రాగా ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా చేస్తున్నాడు.

 

స్టార్ కమెడియన్ గా ఒక క్రేజ్ తెచ్చుకుని ఈమధ్య అవకాశాల్లేక వెనుకపడ్డ వారు గురించి చూశాం ఇక ఇప్పుడు ఈమధ్య కాలంలో సూపర్ కామెడీతో అలరించిన కమెడియన్స్ లిస్ట్ చూస్తే.. అందులో పృద్జ్వి రాజ్, సప్తగిరి, వెన్నెల కిశోర్ ఉన్నారు. అప్పటికి ఇప్పటికి అలి మాత్రం ఒకటే ఫాం కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: