ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన "దిశా ".. ఓ అమ్మాయిని దారుణంగా హత్యాచారం చేసి అతి క్రూరంగా చంపేసిన మృగాళ్లను పోలీసులు ఎన్‌ కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు ఈ ఘటనపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఏదో ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. 


ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ ఎపిసోడ్ గురించి ఆరా తీస్తున్నారనే టాక్ సినీ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. పైగా ఈ ఘటన ఎమోషనల్‌ గా దేశం మొత్తాన్ని కదిలించింది. దీంతో ఈ సీన్ ను ఒక సినిమాలో ఉంటే.; లేదా దీనిపైనే సినిమా తీస్తే అదిరిపోతుందని ప్రతీ దర్శక నిర్మాత కూడా భావిస్తున్నాడు. అందుకే తమ సినిమాల్లో దిశ ఎపిసోడ్‌ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో అందరికంటే ముందు తమిళ దర్శకుడు దిశ ఎపిసోడ్ నేపథ్యంలో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. 


ఇక ఈ సంచలన పాత్రలో అక్కినేని కోడలు సమంత నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. సమంత పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే మరి..  ఇప్పటికే ఈ భామ 'యూ టర్న్', 'ఓ బేబీ' సినిమాలతో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా దిశ ఉదంతం పై తెరకెక్కుతున్న సినిమాకు ఈమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.


తమిళనాట 'మాయ', 'గేమ్ ఓవర్' లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందని.. అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఓ యువతి ఆత్మరూపంలో వచ్చి తన జీవితం నాశనం చేసిన మృగాళ్లను ఎలా అంతమొందించిందన్నది కథ అనేది తెలుస్తుంది. సమంత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న '96' రీమేక్ షూటింగ్‌ తో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్-2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో సమంత నెగటివ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి దిశ పాత్రలో సమంత కనిపిస్తే సంచలనమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: