హైదరాబాద్ అంటే బ్యాడ్మింటన్ కి పెట్టింది పేరు. బ్యాడ్మింటన్ లో ఛాంపియన్లందరూ హైదరాబాద్ నుండి వచ్చిన వారే. సైనా నెహ్వాల్ అయితేనేమి, పీవీ సింధు అయితేనేమి ఒకరా ఇద్దరా చాలా మంది బాడ్మింటన్ ప్లేయర్లు ఉన్నారు. కానీ అందరిలోకి అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి ఒకరున్నారు. ఆమే గుత్తా జ్వాలా. గుత్తా జ్వాలా బాడ్మింటన్ క్రీడాకారిణిగా అందరికీ సుపరిచితమే. కానీ అంతకుమించి ఆమె వ్యాఖ్యాల ద్వారా మరింత పాపులర్ అయింది.

 


గుత్తా జ్వాలా బోల్డ్ కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే గుత్తా జ్వాలా తాజాగా బ్యాడ్మింటన్ అకాడమీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె నుండి వచ్చిన మరో వార్త సెన్సేషనల్ అయింది. గత కొన్ని రోజులుగా గుత్తా జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా కొత్త సంవత్సరం కానుకగా ఆమె తన డేటింగ్ విశేషాలను సొషల్ మీడియా ద్వారా పంచుకుంది. జ్వాలా, విష్ణు  క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ఇంత‌కుముందే బ‌య‌టికి వ‌చ్చాయి. తాజాగా విష్ణుతో చాలా రొమాంటిక్‌గా ఉన్న ఫొటో, వీడియో రిలీజ్ చేస్తూ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పింది జ్వాల‌. ఈ ఫొటోలు, వీడియోల్లో జ్వాల‌, విష్ణుల తీవ్రత చూస్తే వాళ్లెంత గాఢమైన ప్రేమలో ఉన్నారో అర్థ‌మ‌వుతుంది.

 


అయితే వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందనేది ఎవరికి అర్థం కావట్లేదు. విష్ణు చెన్నైలో ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు. జ్వాలా అకాడమీ నడుపుకుంటుంది. మరి వీరిద్దరికి మధ్య ఇంత క్లోజ్ నెస్ ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. మొత్తానికి వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని రివీల్ చేసి తన మీద వచ్చే పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: