టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో టాప్ హీరోలతో మరియు కుర్ర హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ కెరియర్ లాకోస్తున్నా రకుల్ ప్రీత్ సింగ్ కరోనావైరస్ కష్టకాలంలో అనేక మంది పేదలను ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా లాక్ డౌన్ టైంలో ఇండస్ట్రీలో ఏ టాప్ హీరోయిన్ చేయని విధంగా పేదలకు భోజనం పెడుతూ తన మంచి మనసు చాటుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ కి ముంబైలో సొంత ఇల్లు ఉండటంతో తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ తన ఇంటి దగ్గర భోజనం వండించి, వారికి ప్యాకెట్ల రూపంలో రెండుపూటలా ఆకలి తీర్చింది. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న పేదల కోసం ప్రత్యేకమైన టీం పెట్టి వారికి ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందించి తన వంతు సాయం చేసి లాక్ డౌన్ సమయంలో వార్తల్లో నిలిచింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ముంబైలో వైరస్ తీవ్ర స్థాయిలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నగరంగా ముంబై ఉంది. పైగా దేశ ఆర్థిక రాజధాని కావటంతో పరిస్థితి ని కంట్రోల్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంబై నగరాన్ని లాక్ డౌన్ లో పెట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ముంబై నగరం నుండి పూర్తిగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ కి రకుల్ ప్రీత్ సింగ్ షిఫ్ట్ అయింది.

 

కరోనా గురుంచి రకుల్ మాట్లాడుతూ ముంబై కంటే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన ప్రాంతం అని తెలిపింది. రకుల్ కి హైదరాబాదులో కూడా ఇల్లు ఉండటం జరిగింది. దాదాపు ఈ ఇంటిని విడిచి మూడు నెలలు కావడంతో తిరిగి.. హైదరాబాద్ లో తన సొంత ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా, అదే రీతిలో తమిళ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: