అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం తన కెరియర్ మీద చాలా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. సాధారణంగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు రావు కాని సమంత మాత్రం పెళ్లికి ముందు ఎలాంటి ఫాం కొనసాగించిందో అదే ఫాం పెళ్లి తర్వాత కొనసాగిస్తుంది. సినిమాలే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా సమంత తన స్టామినా ఏంటో చూపిస్తుంది.

ఈమధ్యనే ఆహాలో సమంత స్పెషల్ షో చేస్తుంది. ఈ షోలో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ ను తీసుకొచ్చి ఆమె ఇంటర్వ్యూస్ చేస్తుంది. ఇక ప్రస్తుతం తన కెరియర్ గురించి స్పందించింది సమంత. తనకు నిజంగానే అదృష్టం ఎక్కువని చెబుతుంది అమ్మడు. పెళ్లి తర్వాత తనకు అవకాశాలు వస్తాయని అనుకోలేదు అలా అనుకునే పెళ్లి చేసుకున్నా కాని పెళ్లి తర్వాత సినిమాల్లో నటించగలగడం అదృష్టంగా భావిస్తున్నా.. పెళ్లి కెరియర్ కు అడ్డు కాదని ప్రూవ్ అయ్యింది. పెళ్లి తర్వాత కెరియర్ ప్లాన్ చేయలేదు కాని అదృష్టం కొద్దీ అలా జరిగిపోతుందని అన్నది సమంత.

పెళ్లి తర్వాత చేసిన రంగస్థలం పెద్ద హిట్ అవడం.. ఆ తర్వాత మహానటి, ఓ బేబీ సినిమాలు హిట్ అవడంతో సమంతకు పెళ్లైనా తనని ప్రేక్షకులు మాత్రం ఇంకా సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. చూస్తుంటే సమంత మరో ఐదారేళ్లు ఇదే జోరు కొనసాగించేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అశ్విన్ శరవణన్ డైరక్షన్ లో సమంత ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తుందని టాక్. సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై సూపర్ బజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: