జీవీ ప్రకాష్ కుమార్ అంటే పరిచయం అక్కర్లేని  పేరు. తమిళ్ లో మరియు తెలుగు లోను కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇటీవలే  ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన "ఆకాశం నీ హద్దురా"చిత్రం  మ్యూజికల్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ లోనే కాకుండా, టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న జీవీకి ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. జీవీ  ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ కి స్వయాన మేనల్లుడు.  జీవీ తల్లి తనని చిన్నతనంలోనే రెహ్మాన్ దగ్గర సంగీతం నేర్పించమని పెట్టారట. ఆలా రెహ్మాన్ జీవీకి సంగీతం నేర్పించి, పాటలు పాడించేవారట. ఆలా పడిన కొన్ని పాటలు జీవి కి మంచి పేరును తీసుకోచ్చాయి .. రెహ్మాన్  నీడలో సంగీతం నేర్చుకుంటున్న జీవీకి ఊహించని షాక్ ఎదురైంది. జీవీ తల్లి, తండ్రి విడిపోయారు.  అయితే  అమ్మ దూరంగా ఉందన్న బాధను మర్చిపోవడానికి జీవీ  సంగీతాన్ని అలవాటు చేసుకున్నారు. అలా పియోనాతో పాటు కీబోర్డు పైన పట్టు సంపాదించారు.  
అయితే జీవీ టాలెంట్ చూసిన సంగీత దర్శకుడు భరద్వాజ్ తన దగ్గర  పనిచేయమని చెప్పారట. అప్పుడు ప్రాక్టిస్ చేయడానికి తన దగ్గర సంగీత పరికరాలు లేకపోవడం . ఆ సమయంలో మావయ్య సహాయం అడిగితే చేస్తారు కానీ ఎందుకో జీవీ కి  ఆలోచన రాలేదట. అలా తన తండ్రి ఏదోలా కష్టపడి కొనిచ్చిన పరికరాలతోనే జీవీ సంగీతం నేర్చుకున్నారు. ఆలా జీవీ  భరద్వాజ్, విద్యాసాగర్, హ్యారీస్ జయరాజ్ వంటి సంగీతదర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ మెల్లగా అడ్వర్టైజ్మెంట్లు లకు  మ్యూజిక్  చేయడం మొదలుపెట్టారు. అయితే జీవీ దగ్గర సత్తా ఉందని తెలిసి ఆయన తల్లి అతడిని  రెహ్మాన్ దగ్గరకు తీసుకెళ్లారట. మేనల్లుడి అయినా రెహ్మాన్ అతడిని వెంటనే  తీసుకోలేదట. అర్హత ఉందో లేదో పరీక్షించి అప్పుడు తన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చారట.  రెహ్మాన్ దగ్గర పనిచేయడం అంటే హెడ్ మాస్టర్ ముందు నిలుచుని ఉన్నట్టే ఉంటుందట జీవీకి. ఆ భయమే, గురువు పట్ల భక్తి, అప్పటివరకూ లేని క్రమశిక్షణ ఏర్పడ్డాయట. అలా రెహ్మాన్ తో కలిసి రంగ్ దే బసంతి, స్వదేశ్ వంటి సినిమాలకి ప్రోగ్రామర్ గా పనిచేసిన జీవీ, ఆ తర్వాత మెల్లగా సంగీత దర్శకుడిగా అవకాశాలు తెచ్చుకుని ఈ స్థాయికి వచ్చారు. ఏ.ఆర్.రెహ్మాన్ తన మావయ్య అయినా కూడా సొంత టాలెంట్ తో ఎదిగారు. దటీజ్ జీవీ ప్రకాష్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: