తాప్సీ పన్ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ తనవైపుకు తిప్పుకుంది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. అదీకాక  తెలుగులో తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు.. ఇక్కడి దర్శక నిర్మాతలు. హిందీలో మాత్రం మంచి సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నీ ఎంచుకుంటూ అక్కడ అదరగొడుతోంది తాప్సీ. అందులో భాగంగా వచ్చినవే.'పింక్', 'ముల్క్','బద్లా' 'గేమ్ ఓవర్' సాండ్ కి ఆంఖ్ లాంటి సినిమాలు. ఇలా వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ.వైవిద్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న  తాప్సి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకొంది.వివరాల్లోకి వెళ్తే .


ఇటీవల  ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాప్సి పన్ను మాట్లాడుతూ.అందరికి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంవలన పలు రకాల కధనాలు ప్రచారం లోకి తీసుకువస్తున్నారు,నేను ఇంకా వివాహం చేసుకోలేదు.నా జీవితంలోకి వస్తున్నా వ్యక్తి సినిమా రంగానికో క్రికెట్ రంగానికో సంబందించి వ్యక్తి కాదు .అసలు ఈ దగ్గరలో ఉన్న వ్యక్తి అయితే కానే కాదు అని తెలిపారు.నేను ప్రేమిస్తున్న వ్యక్తి బాడ్మింటన్ ఆటగాడైన మథియాస్ బోతో అని తాప్సి వెల్లడించారు.


నా తల్లితండ్రులు ఒప్పుకున్నారు కాబట్టే ఈ విషయాన్నీ బహిర్గతం చేస్తున్నాను.ఈ నేపథ్యంలో తాప్సి తన వివాహం గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడైతే పిల్లలు కావాలి అని కోరుకుంటానో అప్పుడు మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని తెలిపారు.నేను బాగా హడావిడి చేసుకునేలా పెళ్లి చేసుకోను ..చాలా సాదాసీదాగా నా దగ్గర స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటాను అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: