రానా హీరోగా ప్రభు సాల్మన్ రాజు దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ అరణ్య భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ సినిమాని అనుకున్నది అనుకున్న సమయానికి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి అనుకున్నంత క్రేజ్ మాత్రం లభించలేదు. అయితే దీనికి కారణం ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద చేసిన కత్తిరింపులు అనే వాదన వినిపిస్తోంది. అరణ్య కథ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం. అన్న మాట. మనుషులు తమ స్వార్థం కోసం అడవిని ఎలా నాశనం చేస్తున్నారు అనేదే ఈ సినిమా కథ. తీసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ తీసిన విధానం ఆకట్టుకోలేదని అంటున్నారు. 

అయితే దీనికి కారణం నిడివి ఎక్కువ అయిపోతుందని తీసేసిన సన్నివేశాలు ఈ సినిమాను అతుకుల బొంతలా మార్చేశాయని చెబుతున్నారు. అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నా సంబంధం లేకుండా వచ్చే సన్నివేశాలు సినిమా మీద ఆసక్తి రేకెత్తించలేక పోయిందని చెప్పాలి. అసలు సినిమాలో విష్ణు విశాల్ పాత్ర ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాదు, ఇంటర్వెల్ తర్వాత ఈయన పాత్ర ఎక్కడికి వెళ్లిందో తెలియదు, అర్థంతరంగా ముగించారనిపిస్తుంది. 

దీనికి కారణం ఎడిటింగ్ టేబుల్ మీద చేసిన కటింగ్స్ అంటున్నారు. సినిమా ఫైనల్‌ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత రెండున్నర గంటలకు పైగా ఉండటంతో నిర్మాత సురేష్‌ బాబు అంత సమయం చూడటం కష్టమే అనుకుని తగ్గించే ప్రయత్నం చేశాడు. సినిమాను విడుదలకు రెండు మూడు రోజులు ఉండగా దాదాపు అరగంట నిడివి తగ్గించారు. సినిమాలో మరో హీరో విష్ణు విశాల్‌ ఉన్న సీన్స్, ఏనుగులు ఉన్న సీన్స్ తగ్గించారు. రానా పాత్ర విషయంలో కూడా ట్రిమ్ చేశారు. అదే కొంప ముంచింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: