టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ హీరోస్ కి ఉన్న స్థానం, వాళ్లకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికి ఉండదు అని చెప్పాలి. అందుకే ఈ కుటుంబానికి సంబంధించిన చిన్న వార్త వచ్చినా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి హాట్ టాపిక్‌గా మారింది వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతుల బిడ్డ కి పెట్టిన పేరు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో పడి.. కుటుంబ సభ్యుల అంగీకారంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత ఇద్దరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి పండులాంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ హీరోకి వారసుడు పుట్టాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు.


ఇప్పుడు ఈ చిన్నారికి పెట్టిన పేరే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నాగబాబు, వరుణ్ తేజ్ – లావణ్య దంపతులు తమ బిడ్డకు "వాయువ్ తేజ్" అనే పేరు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. "వాయువ్ తేజ్" అనే పేరు అసలే కొత్తది కాదు. గతంలో నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ పుట్టినప్పుడు కూడా అదే పేరును అనుకోవడం జరిగిందట. జాతకం, నక్షత్రం ప్రకారం వరుణ్ తేజ్ కి "వాయు తేజ్" అని పెట్టాలని ఫిక్స్ అయ్యారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పేరు కుదరకపోవడంతో, చివరికి "వరుణ్ తేజ్" అని నామకరణం చేశారట. అప్పట్లో కుదరకపోయిన ఆ పేరు ఇప్పుడు తిరిగి బయటకు వచ్చింది.



అదే "వాయువ్ తేజ్" .  ఇప్పుడు వరుణ్ తేజ్ కొడుకుకే పెట్టడం నిజంగా ఒక విధి విశేషం అని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంటే, ఒకప్పుడు వరుణ్ తేజ్ కి పెట్టాలి అనుకున్న పేరు, ఆయన వారసుడికి రావడం నిజంగా డెస్టినీ అని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ మరింత ఎమోషనల్ అవుతూ – “ఇదే మెగా వారసత్వం! ఇక నుంచి వాయువ్ తేజ్ మెగా ఫ్యామిలీ వారసుడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వరుణ్ తేజ్ తన కొడుకుకి పెట్టిన పేరుతో, ఒకప్పుడు మిస్సైన కథ మళ్లీ పూర్తయినట్టే. నిజంగానే "విధి" అంటే ఇదే అని చెప్పక తప్పదు!

మరింత సమాచారం తెలుసుకోండి: