పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహసాల గురించి చెప్పనవసరం లేదు.. చిన్న తనంలోనే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని సినిమాల్లో దూప్స్ లేకుండా చేసిన ఘనత ఆయనది. తమ్ముడు సినిమాలో అయన చేసిన సాహసాలు మర్చిపోలేనివి.. చేతులపై టైర్స్ పోనివ్వడం, పెంకులను పగలకొట్టడం, నీటికుండను పగలగొట్టడం వంటి ఎలాంటి దూప్స్ లేకుండా, ఎటువంటి చీట్ చేయకుండా చేశాడు అంటే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో మనోధైర్యంతో ఆ కళను నేర్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు..

అయితే తనకున్న ధైర్యాన్ని, సాహసం చేసే గుణాన్ని ఎక్కడ ప్రదర్శించే ఛాన్స్ రాలేదు కానీ తొలి ప్రేమ సినిమా టైం లో అయన ఇద్దరినీ రక్షించి రియల్ హీరో అనిపించుకున్నారు.. పవన్ కెరీర్ లో తొలి ప్రేమ సినిమా కి మంచి స్థానం ఉంటుంది.. ఆ సినిమా అప్పటి యూత్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతోనే డైరెక్టర్ కరుణాకరన్ ఫిలిం డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో పవన్ చేసిన సాహసం తెలిస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవుతారు.

కొడైకెనాలో హీరో హీరోయిన్ లపై ఓ సీన్ షూట్ చేస్తుండగా హీరో హీరోయిన్ లకు సంబందించిన ఇద్దరు డూప్ లు లోయలో పడిపోయారు. ఈ ఇన్సిడెంట్ తో షాక్ అయినా డైరెక్టర్ ఏం చేయాలో తెలీక ఆలోచిస్తుంటే పవన్ లోయలోకి దిగి ఆ ఇద్దరినీ రక్షించాడు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సాహసాలు చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్.. ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈనెల 9 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉండగా అయన అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: