తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు వచ్చిన కూడా కొన్ని జంటలు నటించిన సినిమాలు మాత్రం జనాలను బాగా అలరించాయి. ఆ జంట కలిసి నటించిన సినిమా ఇప్పటికీ కూడా అంతే ఆసక్తిని కలిస్తాయి.. ఆ విధంగా ఆకట్టుకున్న జంటలలో ఒకరు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట కు ఇండస్ట్రీలో ఒక మంచి టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి జోడీ చూడముచ్చటగా, కన్నులపండువగా ఉంటుందని అభిమానులు సంబరపడిపోతుంటారు. ఈ జంట కలిసి నటించిన 'గీతగోవిందం' 'డియర్‌ కామ్రేడ్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.


 అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ ని లాక్ చేసాడు. బన్నీ వాస్ నిర్మతగా.. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక లవ్ ఎంటెర్టైనెర్ గీత గోవిందం సినిమా చేసాడు. ఈ సినిమా లో కాలేజ్ లెక్చరర్ గా అమ్మాయిని ప్రేమలో పడేసే లవర్ బాయ్ లా విజయ్ దేవరకొండ సూపర్ పెరఫార్మెన్స్ సినిమా మీద అంచనాలు పెంచేలా చేసింది. ఇక ఛలో సినిమా తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన రష్మిక మందన్న గీత పాత్రలో గోవిందుడిని అంటే విజయ్ దేవరకొండని తన వెంటపడేలా చేసుకున్న పాత్రలో కనిపించేలా చేసింది. మరి ఈ సినిమా లో విజయ్, రష్మికల కెమిస్ట్రీ మీద యూత్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకుంది..


మొదటి సినిమా హిట్ అయిన అంతగా రెండో సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు. మొదటి నుంచి లవర్ బాయ్ గా నటించిన విజయ్ ఈ సినిమాలో కార్మికుల లీడర్ గా నటించారు. అయితే ఆ సినిమా వల్ల ఈ జంటకు పేరు రాలేదు.. కానీ ఇండస్ట్రీలో వీరి జంటకు మంచి డిమాండ్ ఉంది.. ఇద్దరు కలిసి మరో సినిమాలో నటించాలని అందరూ అనుకుంటున్నారు. మరి వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి.. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ కలిసి తిరుగుతున్న సందర్భంలో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: