అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆంతరం గోకులంలో సీత మూవీ చేసిన పవన్, ఆ మూవీ ద్వారా కూడా సక్సెస్ అందుకున్నారు. ఆపై ఆయన నటించిన సుస్వాగతం మూవీ కూడా విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాల తరువాత తమిళ దర్శకుడు కరుణాకరన్ తో కలిసి తొలిప్రేమ మూవీ చేసారు పవన్.

జివిజి రాజు రాజు నిర్మించిన ఈ సినిమా విడుదల తరువాత సంచలన విజయాన్ని అందుకని, పవన్ కు యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా పేరు తెచ్చిపెట్టింది. హృద్యమైన లవ్ స్టోరీగా పలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిపి కరుణాకరన్ తీసిన ఈ సినిమాకి దేవా సంగీతాన్ని అందించగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. తెలుగు ఇండస్ట్రీ లోని లవ్ క్లాసికల్ మూవీస్ లో ఒకటిగా తొలిప్రేమ మూవీ నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే ఆ మూవీ అనంతరం మరొక్కసారి పవన్, కరుణాకరన్ కలిసి చేసిన సినిమా బాలు. శ్రియ శరణ్, నేహా ఒబెరాయ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు.

మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమాలో పవన్ నటనకు మంచి పేరు దక్కినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది. కథ బాగున్నప్పటికీ దానిని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు అంటూ ఈ మూవీ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆ విధంగా పవన్ కెరీర్ లో తొలిప్రేమ తో మంచి హిట్ ఇచ్చిన కరుణాకరన్, ఆ తరువాత బాలు రూపంలో ఒక పరాజయాన్ని కూడా అందించారు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: