ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఏనాటికైనా ప్రేమకథ చిత్రం అంటే చెప్పుకునేది ఒకే ఒక్క సినిమా కమల్ హాసన్ హీరోగా నటించిన మరో చరిత్ర. కె.బాలచందర్ దర్శకత్వంలో సరిత, మాధవి హీరోయిన్ లు ఎం.ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1978 మే 19న విడుదలై ఇండియన్ సినిమా చరిత్రనే మార్చేసింది. అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపు లో విడుదలైన మరో చరిత్ర సినిమా ఎంతటి సంచలన విజయం సాధించింది అంటే ఇప్పటికీ ఆ సినిమాకు అభిమానులు కోట్లాది మంది ఉన్నారు.

కమలహాసన్ సరిత కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఈ చిత్రం ప్రేమలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరు దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డు చెప్పిన పెద్దలతో వాదనకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకోకుండా తన నిజమైన ప్రేమను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరి కథ చివరకు ఈ విధం గా ముగిసింది అనేది అసలు కథ. చక్కని పాటలు, బాలచందర్ దర్శకత్వం, పాత్రలకు తగిన నటన, సంభాషణలు ,వైజాగ్ గాజువాక అందాలు, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి

ఇందులో కలకాలం నిలిచి పోయిన పాటలు ఉన్నాయి ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదల చేయబడి తమిళనాడు లో సంవత్సరం పాటు నడిచింది. 1981లో ఇదే సినిమా ని ఎల్.వి.ప్రసాద్ హిందీ లో రీమేక్ చేయగా అక్కడ అ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  తెలుగు హిందీ సినిమాలు రెండు కూడా హైదరాబాదులో 365 రోజులు ఆడాయి. కమల్ హాసన్ ఎప్పటికీ తన కెరీర్ లో బెస్ట్ సినిమా అంటే మరో చరిత్ర అని చాలా సార్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: