పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ సినిమా ఫ్లాప్ అయినా సరే ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డులు సృష్టిస్తాయి. ఇక పవర్ స్టార్ సినిమా హిట్ టాక్ వస్తే వసూళ్ల బీభత్సమే. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు, సాగర్ చంద్ర డైరక్షన్ లో అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఏకే రీమేక్ లో పవన్ తో పాటుగా దగ్గుబాటి హీరో రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంక్ర్ సినిమా కూడా లైన్ లో ఉంది. పవన్ తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. మహేష్ నటించిన పోకిరి, రవితేజ నటించిన అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్ సినిమాలు కాదనుకున్నాడు. ఇక లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాను కూడా పవన్ మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ పవన్ కు కథ చెప్పారట కథ కూడా పవన్ కు నచ్చిందట. కాని అప్పుడున్న టైం  లో తను కొద్దిగా బ్రేక్ తీసుకోవాలని చెప్పారట.

ఈలోగా రాజమౌళి రవితేజని ఒప్పించడం సినిమా కన్ ఫర్మ్ అవడం జరిగింది. రవితేజ కెరియర్ లో విక్రమార్కుడు ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఒకవేళ నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్రమార్కుడు సినిమా చేసుంటే అప్పుడు ఎలా ఉండేది అంటే పవన్ చేసినా కూడా విక్రమార్కుడు ఓ రేంజ్ హిట్ అయ్యేదని చెప్పొచ్చు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు విక్రమార్కుడు కూడా ఓ సూపర్ హిట్ సినిమాగా వారి మనసుల్లో నిలిచేది. పవన్ కాదని ఆ ఛాన్స్ మిస్ చేశారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: