కోలీవుడ్ లో డైరక్టర్ గా తన సత్తా చాటిన సముద్ర ఖని తెలుగులో మాత్రం నటుడిగా తన ఫాం కొనసాగిస్తున్నాడు. ఏదో సరదాగా నటుడిగా మారిన సముద్ర ఖని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో విలన్ గా నటించిన సముద్ర ఖని ఈ ఇయర్ మొదట్లో వచ్చిన క్రాక్ సినిమాతో కూడా మెప్పించాడు. క్రాక్ సినిమాలో కరాటే కృష్ణ పాత్రలో సముద్ర ఖని నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాటతో పాటుగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా నటిస్తున్న సముద్రఖని మెగాస్టార్ మూవీలో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది.

చిరు చేస్తున్న లూసిఫర్ రీమేక్ లో సముద్ర ఖనికి విలన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మళయాళంలో మంచి హిట్ కొట్టిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో చిరు స్పెషల్ లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. ఈమధ్యనే సినిమాకు సంబందించిన చిరు లుక్ టెస్ట్ జరిగిందని టాక్. మళయాళ వర్షన్ లో యంగ్ హీరో రోల్ ను తెలుగులో కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

చిరు ఇమేజ్ కు తగినట్టుగా సినిమాను చాలా మార్పులు చేస్తునన్నారని టాక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథను మార్చుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరు ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ఈ మూవీకి వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉందని మెగా సర్కిల్స్ నుండి వస్తున్న టాక్. ఈ సినిమాతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: