సత్యదేవ్, ప్రియాంక జవల్కర్ జంటగా శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా తిమ్మరుసు. ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ ఎస్ కోనేరు, సృజన్ యరబోలు ఈ మూవీ నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత డేర్ చేసిన్ థియేటర్లలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తిమ్మరుసు మూవీ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 


సిన్సియర్ లాయర్ రామచంద్ర (సత్యదేవ్) తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి టైం లోనే ఓ క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో తాను చేయని నేరానికి 8 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కేసుని రామచంద్ర టేకప్ చేస్తాడు. ఆ కేసుని రీ ఓపెన్ చేసి డీటైల్స్ సేకరిస్తున్న టైం లో రాంచంద్రకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఈ కేసు విషయమై రామచంద్ర అనుకోని ఇబ్బందుల్లో పడతాడు. ఇంతకీ అసలు ఈ కేసు ఎలా తప్పుదోవ పట్టించారు..? రామచంద్ర ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి..? లాయర్ రాంచంద్ర వాటిని ఎలా అధిగమించాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

ఈమధ్య తెలుగులో కోర్ట్ రూం డ్రామా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇయర్ మొదట్లోనే నాంది, వకీల్ సాబ్ సినిమాలు కోర్ట్ రూం సినిమాలుగా మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తిమ్మరుసు కూడా మరో కొత్త ప్రయత్నంగా వచ్చింది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తికి ఆసరాగా నిలిచిన ఓ లాయర్ కథ తిమ్మరుసు.

కన్నడ సినిమా కథ స్పూర్తితో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. ఆడియెన్స్ ఊహించని రెండు మూడు ట్విస్టులు సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్వల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఉండేలా చూసుకున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ జస్ట్ అలా అలా సాగగా సెకండ్ హాఫ్ స్పీడ్ గా వెళ్లిందని చెప్పొచ్చు. సత్యదేవ్ తన పరిధి దాటి కమర్షియల్ ఫార్మెట్ లో తీసిన సినిమా ఇది. అయితే ఈ ఫార్మెట్ లో కూడా అతని టాలెంట్ చూపించాడని చెప్పాలి. సినిమా ప్రేక్షకులను నిరాశపరచదని మాత్రం చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

రామచంద్ర పాత్రలో సత్యదేవ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ప్రతి సినిమాకు తన విలక్షణ నటనతో సత్యదేవ్ ఇంప్రెస్ చేస్తున్నాడు. ప్రియాంకా జవల్కర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బ్రహ్మాజి పాత్ర ఎంటర్టైనింగ్ గా ఉంది. అంకిత్ కూడా బాగానే చేశాడు. అజయ్, చైతన్య రావు, ఝాన్సి, ప్రవీణ్, హర్ష, బాలకృష్ణన్ అందరు వారి పరిధి మేరకు పాత్రల్లో మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాకు తగ్గ మూడ్ ను క్రియేట్ చేయడంలో కెమెరామెన్ సక్సెస్ అయ్యాడు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బీజీఎం ఇంప్రెస్ చేస్తుంది. డైరక్టర్ శరణ్ కొప్పిశెట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రతిభ చాటాలని చూశాడు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్  :

సత్యదేవ్ నటన

స్టోరీ

బిజీఎం

ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

అక్కడ సీన్స్ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

సత్యదేవ్ తిమ్మరుసు.. మంచి ప్రయత్నమే కానీ..!

రేటింగ్ : 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: