
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించాడు. మరొక మెయిన్ పాత్రలో షావుకారు జానకి నటించింది. ఆ సినిమా పేరే"కన్యాశుల్కం". ఈ సినిమాలో షావుకారు జానకి అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. షావుకారు జానకి చేసిన పాత్రలో ముందుగా జమున ని అనుకోగా, కానీ ఆమె తండ్రి చాదస్తం వలన అలాంటి అవకాశాన్ని కోల్పోయింది జమున. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న జమున ఇలాంటి పాత్ర చేస్తే మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందుతుందని నిర్మాత నారాయణ అనుకొని, జమున ఇంటికి వస్తున్నట్లు ఆమెకు తెలియజేశాడు.
కానీ జమున తన తండ్రి మాత్రం ..తమ ఇంటికి ఒక మంచిరోజు చూసి వస్తే మంచిదని తెలియజేశాడు. జమున తండ్రి జమునకు నిర్మాత నారాయణ గురించి ఇలా చెబుతూ"ఆయన చాలా డెంజర్ మనిషి". అతనితో సినిమాలు చేయకపోవడమే మంచిది అని తెలియజెప్పాడు జమున తండ్రి. కానీ జమున ఇంటికి నారాయణ వస్తేనే నమస్కారం పెట్టి ,కాఫీ ఇచ్చి, కథ చెబుతున్నప్పుడు మా అమ్మాయి బిజీగా ఉందంటూ చెప్పేసాడు జమున తండ్రి. అందుచేత ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది.