ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ప్రముఖుల బయోపిక్ లను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటు ప్రేక్షకులు కూడా బయోపిక్ లను బాగా ఆదరిస్తుండడంతో బయోపిక్ లకు డిమాండ్ పెరుగుతోంది. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం బయోపిక్ లలో నటించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. అంతే కాకుండా స్పోర్ట్స్ నేపథ్యంలో కూడా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇపుడు ఈ రెండింటికి సంబందించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ కూడా ఇదే తరహాలో తెరకెక్కనుంది అన్న వార్తలు జోరుగా వినపడుతున్నాయి. ప్రస్తుతం యావత్ భారత దేశంలో ఆమె పేరు మారుమోగుతున్న క్రమంలో ఆమె క్రీడా ప్రయాణాన్ని వెండి తెరపై చూపించాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఈ చిత్రం భావి భవితకు స్ఫూర్తిదాయకంగా మారుతుందని భావిస్తున్నారట. ఈమె బయోపిక్ వెనుక తెలంగాణ మంత్రి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ బయోపిక్ తెరకెక్కితే తెలంగాణ ఘనత మరింత పెరుగుతుందని వారు యోచిస్తున్నారట.  పీవీ సింధు గొప్ప క్రీడాకారిణి మాత్రమే కాదు ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని పతకాలను గెలుచుకున్న విజేత కూడా. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకుని ప్రభంజనం సృష్టించారు. ఈ సంవతసరం జరిగిన ఒలింపిక్వ గేమ్స్ర 2020 లో కూడా సెమీస్ వరకు చేరుకొని భారతదేశ ఖ్యాతిని మరింత పెంచింది. కానీ చివరికి కాంస్యంతో సరిపెట్టుకుంది.

వరుసగా పాల్గొన్న రెండు ఒలింపిక్ గేమ్స్ లలో పతకం సాధించడం ద్వారా మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌తో 2017, 18ల్లో రజత పతకాలను అందుకున్నారు సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా సంచలనం సృష్టించారు పీవీ సిందు . ఇటువంటి గొప్ప క్రీడాకారిణి కి దేశం నలుమూలల నుండి ప్రశంసల జల్లులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఈమె ఇంతటి పేరు ప్రఖ్యాతలు పొందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని, భారత మాత ముద్దు బిడ్డ అని ప్రశంసిస్తున్నారు. ఇందులో సింధుగా ఎవరు నటిస్తారు, డైరెక్టర్ ఎవరు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: