మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది అభిమానులు థియేటర్ల వద్ద ఒక రోజు ముందు నుంచే పడిగాపులు కాసే వారు ఒకప్పుడు. ఇప్పుడంటే బుకింగ్లు అవి వచ్చాయి కానీ ఒకప్పుడు అయితే సినిమా థియేటర్ల వద్ద రాత్రి నుంచి క్యూలైన్లలో పడిగాపులు కాసే వారు అభిమానులు. అలా మెగాస్టార్ చిరంజీవి చేసిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మృగరాజు చిత్రం కోసం ప్రేక్షకులు వేలాదిమంది థియేటర్లలో పడిగాపులు కాశారు. 2001వ సంవత్సరంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన మృగరాజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యింది అని చెప్పవచ్చు.

సంఘవి సిమ్రాన్ నాగేంద్రబాబు సహాయక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా టార్జాన్ వంటి పాత్ర తరహాలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పదగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది ఈ సినిమా. ఒక అడవిలో ఒక సింహం అందర్నీ తినేస్తూ ఉంటుంది. మనిషి మాంసం రుచి మరిగిన ఆ సింహం అక్కడ రైలు వంతెనను నిర్మించే ఒక రైలు ఇంజనీర్ ను కూడా చంపేస్తుంది. అలా ఆ ఇంజనీర్ స్థానంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది.

అయితే అడవిలో మహా వేటగాడు గా పేరున్న హీరో కి ఆ సింహాన్ని వేటాడే బాధ్యత అప్పగిస్తూ అప్పగిస్తారు ప్రభుత్వ అధికారులు. అప్పటికే హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉందని తెలిసిన కూడా వారి గురించి అప్పుడే చెప్పరు. చివరకు ఆ సింహాన్ని హీరో అంతమొందించి హీరోయిన్ తో తనకు ఉన్న సమస్యను తీర్చుకుని మళ్ళీ వారి సంసార జీవితంలో ఎలా కొనసాగారు అనేదే ఈ సినిమా కథ. దేవి వరప్రసాద్ నిర్మాణం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సింహంతో హీరో చేసే పోరాటాలు హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో చిరంజీవి చాయ్ చాయ్ అనే పాటను ఆలపించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: