అక్కినేని హీరో నాగ్ చైత‌న్య, బ్యూటీ ఫుల్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్ లు గా క‌లిసి న‌టించిన ల‌వ్ స్టోరీ సినిమా సెప్టెంబ‌ర్ 24 న ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 1000 కి పైగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. ఈ సినిమా విడుద‌ల అయిన నాటి నుంచి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ఈ సినిమా అక్కినేని హీరో నాగ చైత‌న్య కేరీయ‌ర్ లో నే బిగ్ హిట్ అని సినిమా విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ సినిమా ను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఆస‌క్తీ క‌ర‌మైన ల‌వ్ స్టోరీ తో తెర‌కెక్కించార‌ని అంటున్నారు. ఇలాంటి సినిమా కోసం నాగ చైత‌న్య చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి బిగ్ హిట్ దొర‌క‌డం తో అక్కినేని అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ల‌వ్ స్టోరీ చిత్ర బృందం హిట్ ను సెల‌బ్రెట్ చేసుకుంది.



కాగ ల‌వ్ స్టోరీ సినిమా పై గులాబ్ తూఫాన్ ప్ర‌భావం ప‌డి న‌ట్టు ఉంద‌ని తెలుస్తోంది. విడుద‌ల అయిన రోజు నుంచి భారీ క‌లెక్ష‌న్ లు సంపాధిస్తున్న ల‌వ్ స్టోరీ సినిమాకు కాస్త బ్రెక్ లు ప‌డిన‌ట్టు ఉంది. గులాబ్ తూఫాన్‌తో ఈ సినిమా క‌లెక్ష‌న్ లు కాస్త త‌గ్గాయి. ఈ సినిమా విడుద‌ల అయిన రోజు టాలీవుడ్‌ క‌లెక్ష‌న్ లు 6.94 కోట్లు గా ఉన్నాయి. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా 9.66 కోట్ల షేరు ను సొంతం చేసుకుంది. మొత్తం గా వ‌రల్డ వైడ్ గ్రాస్ గా 16.8 కోట్ల మార్క్ ను అందుకుని సంచ‌ల‌నాలు సృష్టించింది. మొద‌ట వారంత రోజుల‌లో భారీ గా వ‌సూల్లు రాబ‌ట్టినా.. వ‌ర్కింగ్ రోజుల‌లో వ‌సూళ్లు కాస్త త‌గ్గాయి. 4 వ రోజున 2.52 కోట్ల ను సాధించింది. అలాగే 5 వ రోజు కేవ‌లం 1.26 కోట్ల  షేర్ మాత్ర‌మే రాబట్టింది. దీని వ‌ల్ల ఈ సినిమా పై గులాబ్ ప్ర‌భావం తీవ్రత ఏర్పాడుతుంది.



సినిమా ఇప్ప‌టికి తెలంగాణ ఆంధ్ర ప్ర‌దేశ్ ల‌లో 34. 38 కోట్ల షేర్  మార్క్ అందు కుంది. అలాగే వ‌ర‌ల్డ్ గా 46,80 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. అయితే ఈ సినిమా ఇంకా క‌లెక్ష‌న్ లు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ సినిమా కు అద్భుత మైన లవ్ ట్రాక్ అలాగే పాటలు క‌లిసి వ‌స్తున్నాయి. ముఖ్యంగా సింగ‌ర్ మంగ్లీ పాడిన సారంగ ద‌రియా సాంగ్ చాలా ఫెమ‌స్ అయింది. అలాగే ఈ చిత్రానికి ప‌వ‌న్ చిల్లం ఇచ్చిన సంగీతం కూడా  సినిమాకు ప్ల‌స్ పాయింట్స్ గా ఉన్నాయి. అలాగే ఈ మ‌ధ్య లో ఏ సినిమా లేక పోవ‌డం ల‌వ్ స్టోరీ సినిమా కు క‌లిసి వ‌చ్చే అంశం.




మరింత సమాచారం తెలుసుకోండి: