హీరోయిన్ స్నేహ ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత తమిళ హీరో ప్రసన్నతో ప్రేమ వివాహం చేసుకొని ఇంటికే పరిమితమైపోయింది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ ప్రేక్షకులకు మధ్యమధ్యలో కనిపిస్తూ ఉంది. అయితే స్నేహ, ప్రసన్నలు వైవాహిక జీవితంలో ఒకొరినొకరు అర్థం చేసుకుంటూ ఆదర్శ దంపతుల్లా ఉంటున్నారు. తమ అన్యోన్యతకు గుర్తుగా పుట్టిన ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. తన లైఫ్ లో స్నేహ ఎంత ప్రాముఖ్యమో తెలుపుతూ ప్రసన్న తన ప్రియమైన సతీమణికి బర్త్ డే విషెస్ తెలిపాడు. స్నేహ తన పట్ల చూపే ప్రేమను సముద్రంతో పోల్చాడు. తనలో కనిపించే చిన్నచిన్న లోపాలను సరిదిద్దుతున్న స్నేహకు కృతజ్ఞతలు చెప్పాడు.

స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. 1981వ సంవత్సరం  అక్టోబర్ 12వ తేదీన మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించారు. సినీ ఇండస్ట్రీలో స్నేహగా పిలువబడుతోంది. ఎక్కువగా తమిళ, తెలుగు చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైంది.
2000వ సంవత్సరంలో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన స్నేహ.. తొలిసారిగా అనిల్-బాబు దర్శకత్వంలో నీలాపక్షి అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం విరుంబుగిరెన్ సినిమాకు సైన్ చేసింది. రెండేళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయింది. అతి తక్కువ కాలంలోనే తమిళుల ఆదరాభిమాానాలు పొందింది. ఆ తర్వాత ఆర్. మాధవన్ సరసన హీరోయిన్ గా ఎన్నవాలే సినిమాలో నటించింది. 2001వ సంవత్సరంలో ఆనందం అనే కమర్షియల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది.

2001వ సంవత్సరంలో ప్రియమైన నీకు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది స్నేహ. ఇది అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో రవితేజ సరసన వెంకీ, 2005లో రాధా గోపాలం, 2006లో శ్రీరామదాసులో కనిపించింది. అంతేకాదు అటు తమిళంలో తురుప్పు గులాన్, శిక్కర్, ది హంట్, ప్రమణి, ది గ్రేట్ ఫాదర్ లాంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది. అంతేకాదు కన్నడ సినిమాల్లో కూడా తన నటనా ప్రతిభను కనుబరిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: