చిరంజీవి గారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విడుదలైన రెండు సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. అదేవిధంగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ వరుసగా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం, ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మొదటిసారి గా వస్తున్న ఈ సినిమాపై తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ
ఇదివరకు రిలీజ్ అయినా పాట, మరియు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సిద్ధ ట్రైలర్ యూట్యూబ్ లో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసినదే.ఇక ఒకవైపు పెరుగుతున్న కరోన కేసులు ఈ సినిమా దర్శకుడిని, నిర్మాతను, చిత్ర యూనిట్ ను భయాందోళనకు గురిచేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రం పరిస్థితి ఏంటన్నది అటు సినిమా పరిశ్రమలోనూ మరొకవైపు అభిమానుల్లోనూ ఆసక్తికరమైన విషయంగా మారింది.