తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా పెద్ద సినిమాలన్నీ వరుసగా పోటీపడడం త తెలుగు సినీ పరిశ్రమని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకపక్కన తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీ, అదేవిధంగా సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్నా పుష్ప, ప్రభాస్ రాదే శ్యాం, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్, మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఆచార్య, వంటి సినిమాలన్నీ వరుసగా విడుదల కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకులలో ఒకరైన కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య.
 
చిరంజీవి గారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విడుదలైన  రెండు సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. అదేవిధంగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ వరుసగా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం, ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మొదటిసారి గా వస్తున్న ఈ సినిమాపై తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ
 సినిమాలో చిరంజీవి కుమారుడు రాము చరణ్ గారు చేస్తున్నారని తెలిసినప్పటినుంచి ప్రజలలో ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.
 
ఇదివరకు రిలీజ్ అయినా పాట, మరియు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సిద్ధ ట్రైలర్ యూట్యూబ్ లో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసినదే.ఇక ఒకవైపు పెరుగుతున్న కరోన కేసులు ఈ సినిమా దర్శకుడిని, నిర్మాతను, చిత్ర యూనిట్ ను భయాందోళనకు గురిచేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రం పరిస్థితి ఏంటన్నది అటు సినిమా పరిశ్రమలోనూ మరొకవైపు అభిమానుల్లోనూ ఆసక్తికరమైన విషయంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: