
ఇలా హీరోయిన్ గా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆలరించారు సుమలత. సీనియర్ హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సుమలత పుట్టింది పెరిగింది ఎక్కడ అన్న విషయం కూడా తెలుసుకుందాం. సుమలత తండ్రి చెన్నైలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సుమలత కూడా అక్కడే పుట్టారు. తండ్రికి బొంబాయి ట్రాన్స్ఫర్ కావడంతో కొన్నేళ్ళపాటు అక్కడికి వెళ్లారు. తర్వాత హఠాత్తుగా తండ్రి మరణించడంతో చివరికి తల్లి ఆమెను గుంటూరు తీసుకువచ్చింది. అక్కడ ఉన్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ లో స్కూల్ లో చేర్చింది తల్లి. టెన్త్ క్లాస్ సమయంలో బ్యూటీ కాంటెస్ట్ జరుగుతూ ఉండగా.. ఆ స్కూల్ నుంచి సుమలత పంపిస్తే బాగుంటుందని స్నేహితులు భావించారట.
స్నేహితులందరూ సుమలత ఇంటికి చేరుకుని హీరోయిన్ తల్లిని కూడా కన్విన్స్ చేశారట. ఆ సమయంలో సుమలతకు 15 ఏళ్ళు. సుమలతకు అలాంటి వాటి మీద ఆసక్తి లేక పోయినప్పటికీ స్నేహితుల ఒత్తిడితో అయిష్టంగానే వెళ్లారట. చివరికి ఆ కాంటెస్ట్ లో సుమలత విజయం సాధించింది. అయితే ఇదే కార్యక్రమానికి ప్రజా నటిగా పేరుపొందిన జమున కూడా ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆ సమయంలోనే నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంది అంటూ సుమలత కి ఆశీస్సులు కూడా ఇచ్చారట జమున. అప్పటికి సుమలతకు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ సుమలత ఆ తర్వాత రామానాయుడు దృష్టిలో పడటం సినిమా ఆఫర్ రావటం చకచకా జరిగిపోయాయ్. ఆ తర్వాత హీరోయిన్ సుమలత ఎంతో అద్భుతంగా రాణించి వెనక్కి తిరిగి చూసుకోలేదు.