
అసిన్ : అందాల ముద్దుగుమ్మ ఆసిన్ 2003 వ సంవత్సరం విడుదలైన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, అదే సంవత్సరం శివమణి సినిమాతో మరో విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత 2004 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన లక్ష్మీనరసింహ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.
అనుపమ పరమేశ్వరన్ : అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా 2016 సంవత్సరం విడుదల అయ్యింది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని సాధించింది, ఈ సినిమాతో పాటు ఇదే సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ మరో విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత 2017 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి సినిమాతో ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి మరో విజయాన్ని అందుకుంది.