టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ మనవడు, నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ ఇటీవల హీరో సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యువ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గల్లా పద్మావతి, జయదేవ్ లు ఎంతో భారీగా నిర్మించారు.

యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసిన ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, అర్చన అనంత్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ,సత్య తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. రిలీజ్ కు ముందు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే టాక్ సొంతం చేసుకుంది. ఇక హీరోగా అశోక్ ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాని మంచి కాన్సెప్ట్ తో హిలేరియస్ గా సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని నాన్న కృష్ణ అభిమానులు, అలానే నా అభిమానులు ఆదరించాలని కోరుతూ సూపర్ స్టార్ మహేష్ ఇటీవల రిలీజ్ కి ముందు ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పేరుగాంచిన ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండిబి వారి నుండి ఏకంగా 9. 2 రేటింగ్ దక్కించుకుని గొప్ప పేరు అందుకుంది. మరోవైపు అంత పెద్ద సంస్థ వారు తమ సినిమాకి ఈ స్థాయి రేటింగ్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలానే ఆడియన్స్ కూడా మా సినిమాని మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నట్లు ఇటీవల యూనిట్ సభ్యులు తెలిపారు. మరోవైపు గల్లా అశోక్ తండ్రి అయిన జయదేవ్ తమ కుమారుడి హీరో సినిమా విషయమై ప్రత్యేకంగా ఐఎండిబి వారికి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: